ప్రతి మనిషి జీవితంలో అన్నిటికన్నా ముఖ్యంగా కావాల్సింది .. సంపాదనే అనుకుంటా ... సంపాదించాలంటే ఏదో ఒక పని చేయాలి. ఉద్యోగమో వ్యాపారమో ఇంకేదో చేయాలి... ఉద్యోగం అంటే సాదాసీదా కాకుండా పేరున్న ఉద్యోగం చేయాలి మంచి position లో ఉండాలి జీతం బాగా రావాలి .. ప్రతి ఒక్కరి ఆలోచన ఇలాగె ఉంటుంది ... అందుకే పెళ్లి చేస్కోవాలంటే ముఖ్యంగా ఉండాల్సింది మంచి ఉద్యోగం మంచి సంపాదనా .. అంటే మంచి career ....
నా వరకి నేను career కన్నా life కి ఎక్కువ importance ఇస్తాను .. లని మంచి లైఫ్ ఉండాలంటే మంచి career ఉండాలి అది నేను ఒప్పుకుంటాను గౌరవిస్తాను .. కానీ నా ఆత్మాభిమానం దెబ్బతినేల పని చేయడానికి ఒప్పుకోను ... ఇప్పటివరకి నేను work చేసిన ఎక్కడ కూడా నాకు problem అవ్వలేదు .. నా nature ని బట్టి ఇక పై కూడా కాదు అనుకుంటున్నాను .. నేను నా పనిని ప్రేమిస్తాను .. నా బాధ్యతలని పూర్తి చేయడానికి ఎంతైనా కష్టపడతాను, ఉద్యోగం లో అయిన ..జీవితంలో అయిన.. సంపాదించడాన్ని
గొప్ప విషయం గా భావించను. మన పని మనం చేస్తూ పోతుంటే రావాల్సిన ప్రతిఫలం, గౌరవం వాటంతట అవే వస్తాయి ... గత 7 నుండి 8 సంవత్సరాలుగా నేను సంపదిస్తునే ఉన్నాను ( చదువు కొనసాగిస్తూనే ).. 500 రూ. నుండి మొదలైన నా సంపాదన వేలుగా ,పది వేలుగా మొన్నటి వరకి 15000 లుగా సాగింది, సాగుతుంది అందులో ప్రతి పైసా సద్వినియ్గం అయిందని చెప్పలేము కాని .. ఎక్కువ మొత్తం సరిగ్గానే ఉపయోగించాను అని నేను నమ్ముతాను ...
అందుకే సంపాదించటం అంటే అదేదో పొడిచేసినట్లు feel అవను ,కొమ్ములు రావు కూడా కాకపోతే మంచి career ఉండాలని నేను కోరుకుంటాను ... ఇప్పటివరకి సంపాదిస్తూనే ఉన్నా నేను .. అందరు కోరుకుంటున్నట్లు మంచి ఉద్యోగం లో చేరటానికి మరో అడుగు దూరంగా ఉండవచ్చు .. 15 కాస్త 20 ,25 లేదా 30 వేలుగా మారవచ్చు ..అది భావిష్యతులో 50, 70 లు గా కూడా మారితే మారవచ్చు . మారకపోను వచ్చు ..who knows.. అందుకే జీతం లో కన్నా జీవితంలో .. మన మనసులో consistency స్థిరత్వం ఉండాలి అంటాను ... ఖర్మ కాలి ఎలా బతకాల్సి వచ్చిన , బతికే సత్తా ఉండాలి అంటాను .. ఏ ఆధారం లేకపోయినా దర్జాగా బతకగలిగే ఆత్మవిశ్వాసం ఉండాలి ... software లాంటి పనికిరాని field లో ఉన్నా నాలాంటి వాడికి అది చాలా అవసరం కూడా ..
i know dignity of labour .. చేసే పని చిన్నద పెద్దదా ఆలోచించాను .. ఎంత వస్తుంది లెక్కలు వేయను కాని పనికి తగినట్లు పొందడం అలవాటు నాకు ... " అతి తక్కువ కూలీకి నీ శ్రమని అమ్ముకో " అనే వాక్యాన్ని నమ్మే వాడిని .. కనుక ఎలాగైనా బతకగలను అనే నమ్మకం విశ్వాసం నాకు చాలా ఎక్కువా .. సంపాదించకుండా కూడా బతికించ గల నమ్మకముంది ... software తో పాటు TV , teaching , administrating ఇలా దేనిలో అయిన ఇమిదిపోగలననే నమ్మకం నాకుంది ...
ఇక ఎంత సంపాదించినా ఒకడి దగ్గిర పని చేయటం అంటే ఎప్పటికి మన టాలెంట్ ని తాకట్టు పెట్టడమే .. అందుకే నాకు జీతగాడికన్నా , యజమాని ల బతకడమే చాలా ఇష్టం ... నన్ను చుసిన వాళ్ళు నాతో మాట్లాడిన వాళ్ళు కూడా అలాగే అంటుండే వాళ్ళు హహహహహ్హ .. మన మెంటాలిటీ ప్రవర్తన అలా ఉంటాదని.. ఏమో మరీ ఎవడికి తెలుసు రేపు ఎలా ఉండబోతుందో అని (మనకి కుడి భుజం పైన పుట్టుమచ్చ కూడా ఉందిలెండి హహ్హహహ్హ ).. who cares about tomorrow ..కాని ఏదో చేయాలి ఏదైనా సాదించాలి అనే తపన మనలో చాలా ఎక్కువా .. అందుకు తగిన ఏర్పాట్లు కూడా మదిలో ఉన్నాయి కాని కాపిటల్ కావాలి కదా అయితే కాస్త కష్టపడాలి .. అందుకే నాకు ఒక extraordinary కాక పోయిన నాకన్నా కొంచెం బెటర్ గా ఉండే గొప్ప brain ఒకటి కావాలి హహహ్హ ...
చిన్నప్పటి నుండి ఒక మంచి స్కూల్ పెట్టాలి అందులో డబ్బులేని , పాపం చదువుకోడానికి వీలు లేని విజ్ఞానులని చదివించాలని ఒక కోరిక ఉండేది .. అది వేరే track కాబట్టి అనుకున్నవి కొన్ని జరిగితే అది అలాగే చేసి చూపిస్తాను ... ఇకపోతే ఇంకొక 20 - 25 సంవత్సరాలలో ఒక TV channel పెట్టాలి .. అది అన్నిటికి different గా ఉండాలి.. దీని కోసం మన మైండ్ లో full sketch ఉంది... ఇంకా ఒక software company అది ఈ మద్య వచ్చిన ఆలోచన ... మన mind కి పదునేక్కువ అని ఒక పిచ్చి నమ్మకం ..so ఒక Add agency ( కంపెనీ ) పెట్టాలి .. అమెరికా పంపించాలని మా నాన్న కి చాలా కోరిక, నేను కూడా US ,UK వేలదమానుకొని,ఇలా కాదు వెళ్తే job పై వెళ్ళాలి అనుకున్నాను ..so ఆ ప్లాన్ కూడా మన మైండ్ లో ఉంది ..కాని అక్కడే ఉండి పోను మళ్ళి INDIA నే మన గమ్యం . ( సినిమా డైరెక్టర్ కావాలని ఉంది కాని అది optional సీరియస్ కాదు, ఏమో నా mind మంచి time వస్తే అవుతానేమో )... ఇది మన కథ ఇందులో ఏ రెండు అయిన చేసి తిరతాను .. కనీసం ఒక్కటన్నా చేసి చూపిస్తాను .. వీలైతే అన్ని చేస్తాను .. ఇది కూడా fix అంతే ... no compramise .. నాకు తెలిసి దీనికి hardwork కన్నా ఒక పద్ధతి ప్రకారం వెళ్ళడమే ఉత్తమం .. ఆ పద్ధతినే నేను ఇపుడు ఆలోచిన్చుకుంటున్నాను.. ఒక్కొక మెట్టు ఎక్కుతూ వెళ్ళాలని అలోచిస్తున్నాను నా ఆలోచనలో తనని భాగం చెయ్యాలని చూస్తున్నాను .... ఏదో ప్రతి వాడు నీ కలలు చెప్పురా బాబు అంటే చెప్పడం లాంటిది కాదమ్మా ఇది .. ఒక్క 30 years ఆగి చుడండి ... జరుగుతుందో లేదో ... let u wait n see ....
ఎందుకంటే వీడిక ఎం చదువుతాడు అనుకున్నపుడు అన్నింటిని దాటి అనుకున్నది చదివాను .. అంతే కాదు మళ్ళి TOP ఉండాలి అనుకున్నాను ఉన్నాను .. చివరి సంవత్సరం నా fee నేనే కట్టాలి అనుకున్నాను కట్టాను ... student గానే teach చేసే stage లో ఉండాలనుకున్నాను సాదించాను .. అంటే గొప్ప కోసం కదండీ నేను అనుకున్నాను అంటే ఎంత కష్టమైన చేసి తీరుతాను అంతే .......
నా సంపాదన ఎంతైనా కానివ్వండి అందులో 5 - 10 % మంచి పనుల కొరకే .......
ఒక్కమాట... ఇదంతా చూసి చదివి ... నేనేదో mono version లో నాకు నచ్చినదే చెప్తున్నా అలాగే ఉండాలి అంటున్నాను అని అని పొరపాటు పడకండి ... I love people being themselves.. ముఖ్యంగా అమ్మాయిలు వాళ్ళఆలోచనకి అనుగుణంగా వాళ్ళలాగే ఉండాలి అనుకుంటాను ... Feel like a PRINCESS అన్నమాట .. కానీ లైఫ్ లోఎక్కడో ఒకచోట రాజి పడాలి ... Compramise అవ్వాలి, తప్పదు .. అదేదో బెటర్ గా అవ్వాలి అని .... ఇది చదివి చఅవునా అనుకుంటే పర్వాలేదు .. ఇప్పుడు అర్థం కాకపోయినా భవిష్యత్తులో అర్థం చేసుకోవడానికి తగినంత సమయంఉంటుంది...
ఎవరి ఆలోచనలకి వాళ్ళు ఉంటూనే , అవసరమైన చోట అర్థవంతంగా నాటించగలగాలనేది నా తత్వం ... ఒక్కటి నేనుబాగా నమ్ముతాను కర్మ కి అనుగుణంగానే ఏదైనా జరుగుతుంది... దేవుడు మనకంటూ ఒక రాత రాసి ఉంటాడు అదిజరిగి తీరుతుంది ... దేవుడు ముడివేస్తేనే జీవితం ... అయిన మానవ ప్రయత్నం జరుగుతూనే ఉండాలి ...so నేనుప్రయతిన్స్తూనే ఉంటాను ... నాకు నచ్చినది నేను ఎలా చేస్తున్నానో , అలాగే ఎదుటి వాళ్ళకి నచ్చింది వాళ్ళు చేస్కునేస్వేచ్చ ఉంది .. అది కాదని బంధనాలు వేసే మూర్ఖుడిని కాదు అంతా సంస్కారం లేని వాడిని కాదు...
కాని being ourselves n keeping others happy అనేది బాగా నమ్మే వాడిని...
Indian Mythology , సంస్కృతి అంతా నమ్మకం పైనే సాగుతుంది .. ఆ నమ్మకాన్ని నేను పూర్తిగా నమ్ముతాను ...
చాలా చాలా ముఖ్యమైన విషయం ఏమిటంటే .. ఎవరినో పరీక్షించడానికో.. ప్రశ్నించాడనికో కాదు ఈ ప్రయత్నం ...I am not here 4, to judge the people... మంచి, చెడు ఈ రెంటిని నేను నమ్మను ఎందుకంటే అవీ చూసే చూపుని బట్టిమారుతుంటాయి అందుకే , అందరు మంచి వాళ్ళే జరిగేది అంతా కూడా మంచిదే అదొక్కటే నమ్ముతాను ...
ఎవరు అర్థం చేసుకోక పోయిన నచ్చక పోయిన పర్వాలేదు కాని ..అపార్థం చేసుకోవద్దు .. ఇలా రాయటం నా పిచ్చినిఅంతా రుద్దటం కోసం కాదు ...
అంగడిలో బొమ్మలాట నాకు నచ్చదు కాబట్టి .. నాకు చిన్నప్పటినుండి పెళ్లి చూపులు అనే తతంగం అంటే కొంచెం భయంకాబట్టి ... ఒకరిని తీసుకు వచ్చి కూర్చోబెడితే .. సరిగా చుసిన చూడకపోయినా తలాడించి ఏదో ఒకటి చెప్పాలి ... హహ్హహ...నిజానికి అలా చెప్పాలంటే నాకు నచ్చని వాళ్ళు అంటూ ఉండరు ... ఎలా ఉంటారు ఎందుకు ఒకరు మనకు నచ్చరు చెప్పండి .. మనలాగా మనం ఎలా ఉన్నామో వాళ్ళ లాగ వాళ్ళు ఉన్నారు అంతే .. మరీ నచ్చడం నచాకపోవడం సమస్యఎక్కడ వస్తుంది .. అందుకే నాకు ఆ పద్ధతి నచ్చదు.. ఎదురుగుగా ఉన్నవాళ్లు మనకి సరిపోతారా? వాళ్ళతో కలసిమనము ఇమిడిపోగాలమా, బతకగలమా చుసుకోవలసినవి ఇవే .. అలాగని ఏదో మహారాజు లాగ కాలుమీదకాలేసుకొని ప్రశ్నలు అడిగేయటం నాకు నచ్చదు, కాని కలసి ఉండాలంటే ఒకరిగురించి ఒకరు పూర్తిగా కాకపోయినాకొంచెమైన తెలుసుకోవలనేది నా భావన .... so direct గా నావల్ల కాదు కాబట్టే ఇలా రాసాను .. భవిష్యత్తులోఅవసరమైనపుడు .. ఈ నా blog ని నా Id ని ఇస్తాను .. నా గురించి కాస్త అయిన తెలుసుకోవచ్చు కదా కనీసం నేనుఇలా ఆలోచిస్తాను అని అయిన ఒక ప్రాథమిక అంచనా ఉంటుంది కదా ... తను అడగలనుకున్నవి అడుగుతుందిచెప్పాలనుకున్నవి చెబుతుంది .... sooooo.................
inka cheppali naa blog complete ayyaka chebuthanu appativaraki please dont mind....
వరకట్నం ఇదొక సాంఘిక దురాచారం .... యదేచ్చగా సాగిపోయే అపచారం...కాని ఎవడు కాదనలేని వద్దనబోని ఒక ఆచారం ...నిస్సందేహంగా, నిర్లజ్జగా జరిగిపోయే ఒక వ్యవహారం ....
మనకి మిగతా విషయాలలో ఎంత స్పష్టత ఉందని చెప్పలేను కాని ... ఈ విషయంలో మాత్రం నాకంటూ స్పష్టమైన అభిప్రాయాలూ ఆలోచనలు ఉన్నాయి .. నేను అలా అనుకున్నాను అలా ఉండాల్సిందే ... ప్రతి సమస్యకి ముందే పరిష్కారం చూసుకునే నేను ... ఒకే విధమైన ఆలోచనతో మొండిగా ఉంటాను అనుకోవటం పొరపాటే .. కానీ నా పరిష్కారం ఏదైనా అంతిమంగా నేను , నా ఆలోచనే గెలిచే విధంగా ఉంటుంది అనేది స్పష్టం ...
అడిగితే ఇవ్వకుండా ఎలా ఉంటామనేది ఒక version అయితే .. ఇచ్చేవాడు ఉన్నంత కాలం తీసుకుంటూ నే ఉంటాము అనేది ఇంకొక version ... మరొక చిత్రం ఏమిటంటే , మేము ఇచ్చాము,మాకు కావాలి అంటూ ఒక గొప్ప న్యాయం... ఇందులోనూ మేము ఇంత ఇచ్చాము కాబట్టి అంతా కన్నా ఎక్కువ కావాలి ... ఆహ ఎం ధర్మం..సరే ఉన్నా వాడంటే ఇచ్చాడు మరీ లేని వాడి సంగతి ...చ పాతకాలం సినిమా స్టొరీ లు మనకెందుకు అనుకుంటున్నారా ,.. కాదు కానే కాదు మన ఖర్మ ఏమిటో కాని ఎన్ని మారిన .. ఈ సమాజం లో కొన్ని మారవు ..ఎందుకంటే ఆచారాలు కట్టుబాట్లు ... బుద్దిగా ఉండమని చెప్పటానికి ఇలాంటి కట్టుబాట్లు రావు .. కానీ ఇలాంటి వాటికి అయితే తన్నుకొస్తాయి మరీ ...
అయిన నాకు అర్థం కాని సందేహాలు చిన్నప్పటి నుండి చాలా ఉన్నాయి .... ఎక్కడైనా డబ్బులు పెట్టి కొనుక్కోవడం చూసాను, కాని డబ్బులు ఇచ్చి మరీ అమ్ముడుపోవడం చూడలేదు ఇదొక్కటే వింత .. క్షమించాలి ఎవరైనా ఈ మాట ని ఇబ్బందిగా ఫీలయితే ... దురాచరమో ఏంటో కాని దీనికన్న కన్యాశుల్కమే అర్థవంతం అనుకుంటా... మేము అబ్బాయిని చదివించి చేసి ఇంత కర్చు పెట్టాము కాబట్టి ఘనంగా ఇవ్వాలి అంటారు .. ఏ అమ్మాయికి కర్చు పెట్టకుండానే అన్ని అయిపోతున్నయా .. చదువు ఎవడన్న ఫ్రీగా చెబుతాడా .. ఫ్రీ గా పెరిగిపోతుందా హా ...
నా కంటూ లోకం తెలిసిన తరువాత , నా లైఫ్ లో నేను చుసిన మొదటి పెళ్లి నుండి నాకు పెళ్ళంటే కొన్ని ఆలోచనలు ఉన్నాయి అందులో మొట్టమొదటిది చాలా ముక్యమైంది కట్నం. నా వరకి నేను doury తీసుకొను ... అలాగని ఆదర్శాలు వల్లించను నాకు తెలుసు ఇదేం సంఘ సేవ కాదు, నాకు నచ్చదు కాబట్టి తీసుకొను ...అలా అని ఇలా చెప్పేసి తప్పించుకొను తప్పనిసరి అయితే తీసుకుంటాను.. మళ్ళి ఇదేం twist అనుకుంటున్నారా ..తప్పించుకోవడం ,ఇప్పుడే మాట మార్చుతుంటే ఇంకా ఎందుకు ఈ మాటలు అనుకుంటారా పర్వాలేదు ఏమైనా అనుకోండి పూర్తిగా చదివిన తరువాత అనుకోండి.. నన్నెవరు అడిగిన నేను అంటాను కట్నం ఎంత కావాలి అంటే ఒక 30 లక్షలకి తక్కువ కాకుండా ఇవ్వాలని .. అంతనా అంతా ఎందుకు అంటే ... అవును అలాంటప్పుడు ఇవ్వకుంటే బెటర్ కదా మరీ కచ్చితంగా తిస్కోవాలి అంటే పెద్ద మొత్తంలో ఇవ్వాల్సిందే మరీ అనేవాడిని .. వ్రతం చెడ్డ ఫలితం దక్కాలి కదా ..
చివరికి ఏమంటాను అంటే అసలు కట్నం ఎందుకివ్వాలి .. అందులో కూడా అంగడిలో పశువులని బేరం పెట్టినట్లు ..ఇంత ఆస్తి ఉంటె ఇంత ...ఇంత జీతం వస్తే ఇంత... ఇల్లు ఉంటె ఇంత car ఉంటె మరింత .. ఏమిటి ఈ బేరాలు అసలు మనం మనుషులమా అన్న సందేహం వస్తే .. ఒక ఇల్లునో స్థలం నో అమ్మకానికి పెట్టినట్లు ఏంటి ఇది .... నాకు ఆస్తులు అంతస్తులు చూసి కట్నాలు ఇవ్వడాలు .. పైసాకి కొరవడని దానిని చూసుకొని మురిసిపోవడం అసలు నచ్చదు ... నాకసలే అర్థం కానీ విషయం ఒకటి already కోట్లు ఉన్నవాడికి ,అమ్మాయి సొమ్ము ఎందుకండీ మళ్ళి ఎమన్నా అంటే practical గా అలోచిన్చామంటారు... అమెరికాలో నెలకు రెండు లక్షలు సంపాదిస్తే కోటి రూపాయలు కట్నం ఇస్తారా .. మరీ వాడు సంపాదించింది ఎవడికి పెడతాడు .. 5 ,6 కోట్ల ఆస్థి ఉన్నవాడికి 50 లక్షల కట్నం ఇస్తే మరీ వాడి ఆస్థి ఎందుకు ఇంకా .. ఇలా ఇస్తారు కాబట్టే వాడికి డబ్బులు ఎక్కువయి ఎం చేయాలో తెలియక ఎక్కడో పాతరేస్తడు ... మళ్ళి మొదటికి వచ్చి గొడవ పెడతాడు ..అందుకే రోజు T V లలో బాగోతాలు కనిపిస్తున్నాయి (నేను అందరిని అనడం లేదు కానీ అమ్మాయిల parents ఆలోచన కూడా మారాలని ). ఆస్తులు చూసి ఇస్తామంటే రేపు ఎవడు ఎలా ఉంటాడో ఎవరు చెప్పగలరు.. అమ్మ ననన్ సంపాదించిపెట్టిన వాడు పోగొట్టుకోదని guarantee ఏంటి .. చిన్నగా మొదలెట్టిన వాడే కోట్లు సంపాదించాడని guarantee ఏంటి.. ఇపుడు నా జీతం పదివేలు అని ఇంతే ఇష్టం అంటే ..పెళ్ళయాక రెండేళ్ళకి 50 లేదా 70 వేలు సంపాదిస్తే కట్నం పెంచుతార ... హా తరువాతది లెక్క ఉండదు .పెల్లపుడు ఎంత ఉందొ అదే లెక్క అంటారా .. ఇదేమన్న realestae వ్యాపారమా IT బూమ్ నా ... మనుషులతో వ్యాపారమా ఛి ఛి ....
నన్ను అడిగితే ఆస్థి పాస్తులు లేని బుద్దిమంతుడికి ఇలా డబ్బులు దార బోసిన, వాడు సద్వినియోగం చేస్తాడు .. వాడికి కృతజ్ఞత ఉంటుంది అమ్మాయిని మహారాణిల చూసుకుంటాడు ఆ డబ్బుతో ఏదన్న పని చేసి బాగుపడతాడు ....తండ్రులు సంపాదించింది కర్చు పెట్టేవాల్లకి ఇచ్చిన విలువ సొంతంగా సంపాదించే వాళ్ళకి ఎందుకివ్వరో మరీ .... మా అన్నయనే తీసుకుంటే 4000 జీతంతో మొదలు పెట్టి లక్ష కట్నం తో కూడా సొంతగా ఇల్లు car సమకూర్చుకున్నాడు, ఇలాంటి వాళ్లకి ఆ కట్నం లాంటివి ఇస్తే , దర్జా జీవితం చూపిస్తారు కదా మరీ, కాని నమ్మదు కదా లోకం. ఇలా ఏ ఒక్క డబ్బున్న వాడి విషయం లో అన్న అయిందా .. ఉదాహరణకి కూడా దొరకవు ... బాగా ఉన్నా వాడికే ఇంకా ఇస్తే ఏమి లాభం ... మనిషిని నడిపించేది ప్రేమ కాని డబ్బు కాదని తెలుసుకుంటే సగం లోకం బాగుపడుతుంది ...
ఇక నా విషయం అంటారా .. చదివారు కదా కట్నం అంటే మనకి అలాంటి అభిప్రాయం ఉంది. అందుకే నేను అసలు తీసుకొను .. మా అన్నయే ఎక్కువ తీసుకోలేదు, నాకు ఎందుకు ....అది ఇంట్లో కూడా అనేసాను కాని ఏదో కొత్త వాదన తీసారు అది prestige అట , తీసుకోక పోతే ఏదో లోపం ఉంది అంటారట .. నిజమే కొందరి విషయాలలో నేను కూడా విన్నాను .. అందుకే తప్పదన్నపుడు తీసుకుంటాను .. కాని నేను గెలవాలి కదా అందుకే అది పూవుల్లో పెట్టి మళ్ళి వెనక్కి ఇచ్చేస్తాను సమయం వచ్చినపుడు .. కొంచెం clear గా చెబుతా wait ..
అంటే నాకు అమ్మాయి బాగా suit అయి పాపం మా మామ డబ్బులు ఎక్కువ లేనివాడు అనుకోండి , అపుడు fighting చేసి అయిన కట్నం తీసుకొను అపుడు కూడా అయన prestige అంటే అయన ఖర్మ నేనేమి చేయలేను .. అప్పులు మాత్రం చేయనివ్వను .. ఎందుకంటే తరువాతి కష్టాలు ఎలా ఉంటాయో నాకు తెలుసు .. మనం అనే ఒక కొత్త మనిషి వాళ్ళ జీవితాలలోకి వస్తున్నదంటే సంతోషంగా ఫీలవ్వాలి కానీ భారంగా కాదు ... నేను నా కోసం మా నాన్న అప్పు చేస్తేనే ఒప్పుకోను మా నాన్న డబ్బులు తిసుకోవడానికే ఆలోచిస్తాను అలాంటిది ... అవసరం లేకపోయినా నా కోసం అప్పు చేసి కష్టపడతాను అంటే ఎలా ఒప్పుకుంటా ..... మనం సంతోషంగా ఉండటానికి ఉపయోగపడని , హ్యాపీగా ఉండనివ్వని prestige లు పట్టింపులు అంటే నాకు చిరాకు ....
ఇక పాపం మా మామ బాగా ఉన్నవాడు అయితే కూతురికి కట్నం ఇవ్వడం గొప్పతనం గా భావిస్తే ,అలాగేతీసుకుంటాను .. కాని అందులో ఏమైనా కర్చు పెట్టిన మళ్ళి వాటిని కలిపి మళ్ళి తనకే ఎపుడో అవసరం అయినపుడు ఇస్తాను .. ఇక్కడ లెక్కలు లేవండి తీసుకొని ఇవ్వడం ఏంటి అని .. తనకి డబ్బు ఎంత ముఖ్యమో తెలిసే రోజు వచ్చినపుడు ఇస్తాను అంటున్నాను .. అలా తీసుకోకపోతే ..... ఆహా ఎన్నాళ్ళ నుండో కల గంటున్న కదా అది నిజం చేస్తా అదే డబ్బుతో ఒక అనాధ శరనలయమో ఇంకేదో ఉపయోగపడేలా అయన పేరు మీదనే కట్టిస్తాను, అంతే కాని కట్నం అనే పేరుతో వచ్చిన ఒక్క రూపాయి కూడా నేను వాడుకోను,ఇక్కడేదో నేను కట్నం తీసుకోలేదు ఆదర్శ పురుషుడినిఅని చెప్పుకు తిరగడానికి కాదు , నాకు ఇవ్వకపోయినా , బాగా కట్నం ఇచ్చాము అని చెప్పుకున్న పరవాలేదు పరువుకోసం అనుకుంటే కానీ ఇవ్వకుండా ఉంటె చాలు ..... ఇది fix
నేను ఇప్పటివరకు ఎలా అనుకున్నానో అలాగే ఉన్నాను ... నిజయితిగానో లౌక్యం గానో కాని అనుకున్నది అనుకున్నట్లే చేశాను ఇప్పుడు అలాగే చేస్తాను .. అందులో మార్పు ఉండదు ... అందుకే చెప్పా సందర్భాన్ని బట్టి ఎంత మారిన .. నాలో మనిషి మారడు వాడు చేసేవి మారవు ... అందుకే అనుకున్నవి చేసి చూపిస్తా అది అంతే .. నాకు మాటలు చెప్పడం అలవాటు అవి చేసి చూపించడము అలవాటే ... నేను mind లో fix అయ్యాను అంటే అలా చేయాల్సిందే అంతే ...
అందుకే ఆస్థి పస్తులు, డబ్బు తో ప్రమేయం లేని ..మనస్పూర్తిగా నమ్మే ప్రేమని నమ్మకాన్ని కోరుకుంటాను నేను ...నన్ను నమ్మితే ఎంతైనా ఏదైనా చేస్తాను .. నమ్మకంకోసమైన చేస్తాను అంతే ....
చివరగా తనే నాకు పెద్ద బహుమతి కావాలి కాని ఇవన్ని ఎందుకు ........