చాలా రోజుల తరువాత నా బ్లాగ్ మళ్ళి రాయటం మొదలుపెట్టా.....
లోపల ఎం రాసానో నేనే మర్చిపోయా కానీ పూర్తిగా లాస్ట్ line వరకి చదివాకా అర్థం చేసుకున్నాకే ఒక అంచకి వస్తారని ఆశిస్తున్నాను ....
చివరగా మనం కోరుకునేది ఒక్కటే ...
అందరు లైఫ్ అంతా హ్యాపీ గా ఉండాలి ... కనీసం ప్రయత్నించాలి అది సాద్యం కాదు అనుకోవచ్చు కాని అనుకుంటే అలా ఉండొచ్చు అని నా అభిప్రాయం .......
ఏదైనా మనం తిస్కునే దానిపై ఉంటుంది ... ప్రతిది పాజిటివ్ గా తిస్కుంటే ప్రతి దానిలో మంచి చూడగలిగితే ఎప్పుడు నవ్వుతు ఉండగలిగితే .. జీవితం అంతా సంతోషాన్ని ఎవడు దూరం చేయలేదు మనకి ....... అలా ఉండే వాళ్ళు కావాలనే కోరుకుంటూ ఈ ప్రయత్నం........
అవసరం ఉన్నా లేకపోయినా ఇన్ని చేప్పాను అంటే ... జనాలకి ఇది బోరింగ్ అని తెలిసిన రాసాను అంటే ... future లో కూడా నన్ను ఇలాగె చూడాలి కాబట్టి .. మన మెదడు ఇలాగె ఉంటుంది కాబట్టి .. ఎలాగు భరించాలి కాబట్టి చెప్పాము ........
ఎన్ని రాసిన అవన్నీ జరగకపోవచ్చు .. కానీ అలా జరిగేల ప్రయత్నిన్చాదనికే .. ఏమి సాద్యం కాకపోయినా హ్యాపీగా ఉండడం సాద్యం కాదంటే ఒప్పుకోను.... అలా ఉండటానికే అలాంటి ఆలోచన కలిగిన వాళ్ళు కావాలనే ఈ ప్రయత్నం.......


నన్ను అడిగిన వాళ్ళతో చేప్పాను .. చదువు ఉద్యోగం money ఇవన్ని మనకి అక్కర్లేదు ... ఏమి చదువుకోకపోయినా మనకి ఓకే .... మనకంటే ఎక్కువ చదివిన ఓకే .. అసలేమి లేకపోయినా లేదా నాకన్నా చాలా గొప్ప స్థితిలో ఉన్నా ఓకే... ఎలాగైనా ఆలోచన విధానం set అవ్వాలి minds set అవ్వాలి అని చేప్పాను .. అదెలా తెలుసుకుంటావు అని అడిగితే .. దానికి పెద్ద పెద్ద పరిక్షలెందుకు... అన్ని విషయాలలోనూ మంచిగా పాజిటివ్ గా ఆలోచిస్తే ... అంతా మంచిగా ఉంటుందనే కదా
........అందంగా ఉన్నా అమ్మాయే కావాలి అనుకోండి ... తనకన్నా అందంగా మనం ఉండాలి అనుకుంటే .. లేదంటే ఆ అందం తప్ప జీవితంలో ఆనందం లేకుంటే ( అందుకే నేను అంటూ ఉంటాను ఒక్క రోజు రెండు రోజుల సుఖం ఆనందం కాదు ... లైఫ్ అంతా సుఖంగా ఆనందంగా ఉండేలా కావాలి అని) నేను ఇప్పటివరకి ఒక లక్ష పైగానే అందంగా ఉన్నవాళ్ళని చూసి ఉంటాను ... అందులో ఒక్కరే కావాలంటే మిగతావాళ్ళు అన్యాయం అయిపోర మరీ హహహ్హహః .....
........ఇక బాగా డబ్బులు ఆస్థి పాస్తులున్న వాళ్ళు కావలి అనుకుంటే అదే డబ్బు నన్ను శాశించదు  అని నమ్మకం ఏంటి ....... ఎపుడు prestige కోసం చూసేవాడు అదే prestige కోసం నన్ను అమ్మేయాడు అని guarantee ఏంటి.......
ఇక మంచితనం .... మంచి చెడు ఎవడు చెప్పగలడు.. ఏది మంచి ఏది చెడు .... మంచి అనేదానికి definition (నిర్వచనం) మనం ఇచిందే కదా ... కొందరికి బాగా తాగేవాడు అసలు నచ్చకపోతే ...కొందరికే అసలు ఏ అలవాటు లేనివాడు చేతగాని వాడిల కనిపించొచ్చు .. కొందరికి కొట్టేవాడు హీరో అయితే కొన్నిసార్లు వాడె విల్లన్ ... ఇదే మంచి అని ఎవడు చెప్పలేడు

అందుకే ఇవన్ని కాదు ... నాకు తెలిసి అందరు అందంగా ఉన్నవాళ్ళే అందరు మంచివాళ్ళే కానీ కావాల్సింది మనకు సరిపోయేవాళ్ళు... మనతో adjust కాగలిగేవాళ్ళు.. మనకి సెట్ అయ్యేవాళ్ళు ... మెంటాలిటీ match అయ్యేవాళ్ళు అంతే.....

ఒక్కొకసారి నా ఆలోచన నాకు పిచ్చిగా అనిపించినా ... తరువాత మళ్ళి నిజమే అనిపిస్తుంది .......

నేను ప్రతిసారి కాక పోయిన  .. చాలా సార్లు కరేక్టేనేమో
పాపం అమ్మాయిలు పెళ్లి దగ్గిర ఈ కలం లో కంప్రామైస్ కావాల్సిన అవసరం లేదంటారు కాని.. మంచి వాళ్ళకి తప్పదు అని మళ్ళి అర్థం అయింది నాకు
డబ్బు దగ్గిరో .. ఆలోచనల దగ్గిర ఇంకా ఎక్కడో ఒక చోట .. తల వంచాల్సిందే
అందుకే నేను ఎప్పుడు కరెక్ట్ నే...... మా cousin పెళ్లి తరవాత అది ఇంకొంచెం బలపడింది ....
ఇంకా కొన్ని తెలుసుకున్నాను ...... ఏంటంటే జనలకేప్పుడు అచ్చంగా నిజాలు చెప్పకూడదు.. లోపల ఎంత కుళ్ళు పెట్టుకున్న పైకి నటించాలి .. నిజాయితిగా ఉండాలని చూస్తే అంతే సంగతులు.. దయచేసి ఎవరు ఏమి అనుకోవద్దు.. అమ్మాయిల విషయం లో మరీ పక్కగా అస్సలు నిజాయితిగా ఉండకూడదు.. పైకి గొప్పలు పోయిన చాలా మంది అబద్దాన్ని నమ్మే వల్లే ..... కొందరు ఆ అబద్దం లో నుండి బయటకి వచ్చి నిజాన్ని ఒప్పుకోలేక అదే అబద్దంలో బ్రతికే వాళ్ళు ........ అందుకే ఏంటో జీవితం అనిపించింది హహ్హహహహ్హ


కాని నా ముందు ఇపుడొక challenging విషయం ఉంది ....... లైఫ్ లో ఇంకా బాగా సెటిల్ కావాలంట(వాళ్ళ దృష్టిలో ఇంకా డబ్బు సంపాదించడం లెండి) .. కనుక మరో రెండు సంవత్సరాలు పెళ్లి వద్దని ఇంట్లో అంటుంటే ... మన బుర్ర రివర్స్ కదా
నేను ఈ year లో చేసేసుకుంటాను అని చెప్పేసాను  కచ్చితంగా.. ఎందుకంటే 2years నా దగ్గిర అన్ని బాగా ఉంది  ఇంకా ఎం ప్రాబ్లం లేకుండా రెడీ అవుతానేమో కాని... future లో ప్రాబ్లం వస్తే ??? ఇప్పుడే నేను కొంచెం challenging situation లో ఉన్నా కాబట్టి ఇదే మంచి టైం అని నేను ఫీల్ అవుతున్న...
ఈ టైం లో మనతో adjust కాగలిగిన వాళ్ళు జీవితంలో ఎప్పుడైనా ఎలాగైనా మనతో జీవించగలరు అది నా నమ్మకం... నిజం కూడా... ఇంకా ప్రతి ఒక్కడు పెళ్ళికి ముందే బాగా సెటిల్ అయి నేనొక్కడినే అన్ని సాదించేశా  అనుకునే తత్వం నాకు నచ్చదు ... ఇప్పటి వరకు నేను ఏదైనా సాదించే గలిగేలా రెడీ అయ్యాను ... ఇక పైన నాకు అన్నింటిలో తోడుగా ఉండే వాళ్ళతో సాదించ కూడదా  ఏదైనా .. ఆ credit  వాళ్ళకి రాకూడదా అందుకే ...........
so అలా డిసైడ్ అయిపోయాను ఇకా.. మీరేమంటారు..
ఏమంటారు లెండి తిట్టుకుంటారు అంతే కదా నో ప్రాబ్లం

ఇక ఒక మాట.......

ఏదో కొత్తగా ఆలోచిస్తున్నాను అనుకొనో... అలా జనాలకి అనిపించలనో ఇలా మొదలు పెట్టలేదు ......
ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఇది జనాలకోసం రాసింది కాదు... ముందే చెప్పాను ఇది కేవలం ఒక్కరికోసమే ... ఒక్కరంటే ఒక్కరి కోసమే
అది కూడా వాళ్ళకేదో గొప్పగా చేసేస్తాను అని చెప్పడం కోసం కాదు ..... నేను ఏంటో కొంచెమైన తెలియడం కోసం .... చాలా recent గా నా నోటితో నేను అన్న మాట .. పెళ్ళైతే అమ్మాయిలకి చాలా కష్టం ... అలవాటు లేని చోట అలవాటు లేని అలవాట్లు కట్టుబాట్లు... ఇంకా చాలా చాలా.. అన్ని సర్దుకు పోయిన వచ్చిన వాడు మంచివాడా మంచి చుసుకునేవాడా కొన్నాళ్ళు పోతే గాని చెప్పలేం ... అంటే తెలిసి కూడా రిస్క్ చేయడమే... అందుకే కొంచెం ప్రయత్నం నా వైపు నుండి .. నా వాళ్ళ ముక్కు మొహం తెలియని బాధ పడితేనే పది సార్లు సారీ చెప్పే పిచ్చోడిని .... నా లైఫ్ అంతా పక్కన ఉండే వాళ్ళ కోసం ఈ మాత్రమైన ఆలోచించకుడద అనుకున్నాను .... నవ్వుకుంటారని తెలిసి కూడా రాసాను
ఎవరు ఏమైనా అనుకోని... లైఫ్ అంతా హ్యాపీ గా ఉండాలి .. హ్యాపీగా ఉంచాలి అంతే


నిజానికి నాకు తెలుసు ఇలాంటివన్నీ పనికి రావు అని .. అయిన ఏదో పిచ్చి ఎవడి బుర్ర తెగులు వాడిది మరీ .... అందంగా flirt చేయగలవాడే ... emotions తో feelings తో గేమ్స్ ప్లే చేసేవాళ్ళని బాగా నమ్ముతారు అని కూడా తెలుసు .. కానీ అందరిలో ఒక్కరనన్ నా లాగా ముద్దా పప్పులాగా ఆలోచించరా అని కూడా అనిపించి మొదలెట్టా ....
ఈ మధ్యే ఒకరు  అడిగారు ... నువ్ రాసినవన్నీ నిజాలే అని guarantee ఏంటి అని ...
నేను చెప్పాను guarantee లేదు అసలు ఇవ్వను కూడా అని... నిజం నన్ను నమ్మమని నేను ఎప్పుడు చెప్పలేదు చెప్పను కూడా  ... నాకు కలగాలి అంతే కాని "నమ్మించడం" కాదు ..
అలా తీయగా మాట్లాడి నమ్మించడానికి .. ఇంత రామాయణం రాసుకోవలిసిన అవసరం లేదు ... చాలా మార్గాలు ఉన్నాయి .. నేను అందరి దారిలోనే వెళ్లి చక్కగా మాట్లాడి నమ్మించడం పెద్ద విషయం కాదు ... కానీ నమ్మకం లైఫ్ అంతా అలాగే ఉండేలా .. ఒక జీవితపు భరోసా ముందే ఇవ్వడం అంతా easy కాదు అందుకే నా మాటలు guarantee లేదు ... ఎందుకంటే నేను చేసేది వ్యాపారం కాదు ...
"నమ్మకం " తో ఏర్పడాల్సిన బంధం ....
అసలు అన్ని బంధాలు గాలిలో కలిసిపోతు ఎవరికీ ఎవరు కాకుండా .బతుకుత్హునన్ ఈ లోకం లో ఉన్నా కాబట్టే .. గాలి పటం దారం తెంపిన అంతా ఈజీ గా బంధాలు తేమ్పుకుంటున్న ఈ లోకం లో ఉన్నాను కాబట్టే ఇంత గా తపన పడటం ....
ఇవన్ని భారి భారి dailogues లాగా అనిపించా వచ్చు సినిమా లాగా అనిపించా వచ్చు అందుకే నవ్వు రావొచ్చు .. కానీ కొన్ని అయిన నిజాలు ఉన్నాయని నా అభిప్రాయం .. ఇవే మాటలు సినిమాల్లో చెబితే ... ఫుల్ ఫ్యామిలీ following ఉంటుంది .. సినిమా సూపర్ హిట్ కాని లైఫ్ కి అన్వయించుకోవడానికి మనకి మొహమాటం ....

చాలా మంది ఇది చూసాక చదివాకా .. వీడు modern బతకటం తెలీని వాడు చేతకాని వాడు ముద్దపప్పు అనుకోవచ్చు... కానీ నేను ఇపుడున్నది అందరు heavy modern అనుకుంటున్నా  లోకంలో కానీ ఇక్కడ కూడా నా identity miss అవకుడదనే.... ఇక చేతగాని వాళ్ళు అంటూ ఎవరు ఉండరు నాకు తెలిసి .... అందరిలా బతకటం నలుగురి వెంట పడటం తిట్టిన్చుకోవటం ... నలుగు చూపులు చూసి అయిపోయిన్దనిపించడం అందరు చేయగలిగేదే అది పెద్ద కష్టం కాదు .. అలా బతకడం పెద్ద విషయం కాదు .. కానీ మన చుట్టూ మనం ఒక గిరి గీసుకొని ఇలాగె బతకాలి అనుకోవడమే కష్టం అలా బతకడమే కష్టం.... మనకి అన్ని చేయడం తెలుసు కానీ చేయడం ఇష్టం లేకపోవడమే ముద్దా పప్పులాగా ఉండటానికి కారణం.... ఇప్పుడు ఎవరి కోసమో మారాలన్న ఆలోచన లేదు .. ఉద్దేశ్యం అంతా కన్నా లేదు .....

దేవుడి గురించి నమ్మకం గురించి రాయలనుకొని .. సంవత్సరం దాటింది అనుకుంటా  ఇప్పటికి రాస్తున్నాను...

దేవుడు ... ఒక నమ్మకం
నాకైతే మాములు నమ్మకం కాదు చాలా నమ్మకం ..... ఏదో అందరికి ముందు నన్ను నేను నమ్ముతాను తరువాత దేవుడిని అంటాను కాని .... నిజానికి మనకి మనకన్నా దేవుదంటేనే ఎక్కువ నమ్మకం ... అయన సెలవిస్తే ఏమైనా జరుగుతుందని నమ్మకం ....... చిమ కుట్టాలి అన్న ఈశ్వరుడి ఆజ్ఞ ఉండాలి అంటారు కదా

మనం  చిన్నప్పటి నుండి ఎం జరిగిన అది అయన వల్లే అని గట్టి నమ్మకం...... చాలా మంది అంటారు దేవుడు మనిషి రూపం లో నే కదా సహాయమం చేస్తాడు అని ... ఏమో నాకైతే కొన్ని సార్లు ఆ మనుషుల  వాళ్ళ కాదు నేరుగా దేవుడి వల్లే జరిగింది.. అందుకే నేను నా కన్నా ఆయననే ఎక్కువ నమ్ముతాను

ప్రతి సారి అయ్యప్ప మాల వేసుకోవడం మాకు అలవాటు... నిజంగా ఆ సమయం లో జీవితం అంటే ఏంటో చుస
భక్తికి .. భగవంతుండికి .. జీవితానికి ఇంత అవినాభావ సంబంధం ఉందా అనిపించింది.... 
చేసే ప్రతి పనిలోనూ .. వేసే ప్రతి అడుగులోనూ జీవితం ఉంది.... ఎత్తులు పల్లాలు .. మంచి చెడు అక్కడే నేర్చుకున్న అనుకుంటా నేను....
వివరంగా తరువాత రాస్తాను......

ప్రతి మనిషి జీవితంలో అన్నిటికన్నా ముఖ్యంగా కావాల్సింది .. సంపాదనే అనుకుంటా ... సంపాదించాలంటే ఏదో ఒక పని చేయాలి. ఉద్యోగమో వ్యాపారమో ఇంకేదో చేయాలి... ఉద్యోగం అంటే సాదాసీదా కాకుండా పేరున్న ఉద్యోగం చేయాలి మంచి position లో ఉండాలి జీతం బాగా రావాలి .. ప్రతి ఒక్కరి ఆలోచన ఇలాగె ఉంటుంది ... అందుకే పెళ్లి చేస్కోవాలంటే ముఖ్యంగా ఉండాల్సింది మంచి ఉద్యోగం మంచి సంపాదనా .. అంటే మంచి career ....

నా వరకి నేను career కన్నా life కి ఎక్కువ importance ఇస్తాను .. లని మంచి లైఫ్ ఉండాలంటే మంచి career ఉండాలి అది నేను ఒప్పుకుంటాను గౌరవిస్తాను .. కానీ నా ఆత్మాభిమానం దెబ్బతినేల పని చేయడానికి ఒప్పుకోను ... ఇప్పటివరకి నేను work చేసిన ఎక్కడ కూడా నాకు problem అవ్వలేదు .. నా nature ని బట్టి ఇక పై కూడా కాదు అనుకుంటున్నాను .. నేను నా పనిని ప్రేమిస్తాను .. నా బాధ్యతలని పూర్తి చేయడానికి ఎంతైనా కష్టపడతాను, ఉద్యోగం లో అయిన ..జీవితంలో అయిన.. సంపాదించడాన్ని
గొప్ప విషయం గా భావించను. మన పని మనం చేస్తూ పోతుంటే రావాల్సిన ప్రతిఫలం, గౌరవం వాటంతట అవే వస్తాయి ... గత 7 నుండి 8 సంవత్సరాలుగా నేను సంపదిస్తునే ఉన్నాను ( చదువు కొనసాగిస్తూనే ).. 500 రూ. నుండి మొదలైన నా సంపాదన వేలుగా ,పది వేలుగా మొన్నటి వరకి 15000 లుగా సాగింది, సాగుతుంది అందులో ప్రతి పైసా సద్వినియ్గం అయిందని చెప్పలేము కాని .. ఎక్కువ మొత్తం సరిగ్గానే ఉపయోగించాను అని నేను నమ్ముతాను ...
అందుకే సంపాదించటం అంటే అదేదో పొడిచేసినట్లు feel అవను ,కొమ్ములు రావు కూడా కాకపోతే మంచి career ఉండాలని నేను కోరుకుంటాను ... ఇప్పటివరకి సంపాదిస్తూనే ఉన్నా నేను .. అందరు కోరుకుంటున్నట్లు మంచి ఉద్యోగం లో చేరటానికి మరో అడుగు దూరంగా ఉండవచ్చు .. 15 కాస్త 20 ,25 లేదా 30 వేలుగా మారవచ్చు ..అది భావిష్యతులో 50, 70 లు గా కూడా మారితే మారవచ్చు . మారకపోను వచ్చు ..who knows.. అందుకే జీతం లో కన్నా జీవితంలో .. మన మనసులో consistency స్థిరత్వం ఉండాలి అంటాను ... ఖర్మ కాలి ఎలా బతకాల్సి వచ్చిన , బతికే సత్తా ఉండాలి అంటాను .. ఏ ఆధారం లేకపోయినా దర్జాగా బతకగలిగే ఆత్మవిశ్వాసం ఉండాలి ... software లాంటి పనికిరాని field లో ఉన్నా నాలాంటి వాడికి అది చాలా అవసరం కూడా ..
i know dignity of labour .. చేసే పని చిన్నద పెద్దదా ఆలోచించాను .. ఎంత వస్తుంది లెక్కలు వేయను కాని పనికి తగినట్లు పొందడం అలవాటు నాకు ... " అతి తక్కువ కూలీకి నీ శ్రమని అమ్ముకో " అనే వాక్యాన్ని నమ్మే వాడిని .. కనుక ఎలాగైనా బతకగలను అనే నమ్మకం విశ్వాసం నాకు చాలా ఎక్కువా .. సంపాదించకుండా కూడా బతికించ గల నమ్మకముంది ... software తో పాటు TV , teaching , administrating ఇలా దేనిలో అయిన ఇమిదిపోగలననే నమ్మకం నాకుంది ...

ఇక ఎంత సంపాదించినా ఒకడి దగ్గిర పని చేయటం అంటే ఎప్పటికి మన టాలెంట్ ని తాకట్టు పెట్టడమే .. అందుకే నాకు జీతగాడికన్నా , యజమాని ల బతకడమే చాలా ఇష్టం ... నన్ను చుసిన వాళ్ళు నాతో మాట్లాడిన వాళ్ళు కూడా అలాగే అంటుండే వాళ్ళు హహహహహ్హ .. మన మెంటాలిటీ ప్రవర్తన అలా ఉంటాదని.. ఏమో మరీ ఎవడికి తెలుసు రేపు ఎలా ఉండబోతుందో అని (మనకి కుడి భుజం పైన పుట్టుమచ్చ కూడా ఉందిలెండి హహ్హహహ్హ ).. who cares about tomorrow ..కాని ఏదో చేయాలి ఏదైనా సాదించాలి అనే తపన మనలో చాలా ఎక్కువా .. అందుకు తగిన ఏర్పాట్లు కూడా మదిలో ఉన్నాయి కాని కాపిటల్ కావాలి కదా అయితే కాస్త కష్టపడాలి .. అందుకే నాకు ఒక extraordinary కాక పోయిన నాకన్నా కొంచెం బెటర్ గా ఉండే గొప్ప brain ఒకటి కావాలి హహహ్హ ...

చిన్నప్పటి నుండి ఒక మంచి స్కూల్ పెట్టాలి అందులో డబ్బులేని , పాపం చదువుకోడానికి వీలు లేని విజ్ఞానులని చదివించాలని ఒక కోరిక ఉండేది .. అది వేరే track కాబట్టి అనుకున్నవి కొన్ని జరిగితే అది అలాగే చేసి చూపిస్తాను ... ఇకపోతే ఇంకొక 20 - 25 సంవత్సరాలలో ఒక TV channel పెట్టాలి .. అది అన్నిటికి different గా ఉండాలి.. దీని కోసం మన మైండ్ లో full sketch ఉంది... ఇంకా ఒక software company అది ఈ మద్య వచ్చిన ఆలోచన ... మన mind కి పదునేక్కువ అని ఒక పిచ్చి నమ్మకం ..so ఒక Add agency ( కంపెనీ ) పెట్టాలి .. అమెరికా పంపించాలని  మా నాన్న కి చాలా కోరిక, నేను కూడా US ,UK వేలదమానుకొని,ఇలా కాదు వెళ్తే job పై వెళ్ళాలి అనుకున్నాను ..so ఆ ప్లాన్ కూడా మన మైండ్ లో ఉంది ..కాని అక్కడే ఉండి పోను మళ్ళి INDIA నే మన గమ్యం . ( సినిమా డైరెక్టర్ కావాలని ఉంది కాని అది optional సీరియస్ కాదు, ఏమో నా mind మంచి time వస్తే అవుతానేమో )... ఇది మన కథ ఇందులో ఏ రెండు అయిన చేసి తిరతాను .. కనీసం ఒక్కటన్నా చేసి చూపిస్తాను .. వీలైతే అన్ని చేస్తాను .. ఇది కూడా fix అంతే ... no compramise .. నాకు తెలిసి దీనికి hardwork కన్నా ఒక పద్ధతి ప్రకారం వెళ్ళడమే ఉత్తమం .. ఆ పద్ధతినే నేను ఇపుడు ఆలోచిన్చుకుంటున్నాను.. ఒక్కొక మెట్టు ఎక్కుతూ వెళ్ళాలని అలోచిస్తున్నాను  నా ఆలోచనలో తనని భాగం చెయ్యాలని చూస్తున్నాను .... ఏదో ప్రతి వాడు నీ కలలు చెప్పురా బాబు అంటే చెప్పడం లాంటిది కాదమ్మా ఇది .. ఒక్క 30 years ఆగి చుడండి ... జరుగుతుందో లేదో ... let u wait n see ....

ఎందుకంటే వీడిక ఎం చదువుతాడు అనుకున్నపుడు అన్నింటిని దాటి అనుకున్నది చదివాను .. అంతే కాదు మళ్ళి TOP ఉండాలి అనుకున్నాను ఉన్నాను .. చివరి సంవత్సరం నా fee నేనే కట్టాలి అనుకున్నాను కట్టాను ... student గానే teach చేసే stage లో ఉండాలనుకున్నాను సాదించాను .. అంటే గొప్ప కోసం కదండీ నేను అనుకున్నాను అంటే ఎంత కష్టమైన చేసి తీరుతాను అంతే .......








నా సంపాదన ఎంతైనా కానివ్వండి అందులో 5 - 10 % మంచి పనుల కొరకే .......


ఒక్కమాట... ఇదంతా చూసి చదివి ... నేనేదో mono version లో నాకు నచ్చినదే చెప్తున్నా అలాగే ఉండాలి అంటున్నాను అని అని పొరపాటు పడకండి ... I love people being themselves.. ముఖ్యంగా అమ్మాయిలు వాళ్ళఆలోచనకి అనుగుణంగా వాళ్ళలాగే ఉండాలి అనుకుంటాను ... Feel like a PRINCESS అన్నమాట .. కానీ లైఫ్ లోఎక్కడో ఒకచోట రాజి పడాలి ... Compramise అవ్వాలి, తప్పదు .. అదేదో బెటర్ గా అవ్వాలి అని .... ఇది చదివి చఅవునా అనుకుంటే పర్వాలేదు .. ఇప్పుడు అర్థం కాకపోయినా భవిష్యత్తులో అర్థం చేసుకోవడానికి తగినంత సమయంఉంటుంది...
ఎవరి ఆలోచనలకి వాళ్ళు ఉంటూనే , అవసరమైన చోట అర్థవంతంగా నాటించగలగాలనేది నా తత్వం ... ఒక్కటి నేనుబాగా నమ్ముతాను కర్మ కి అనుగుణంగానే ఏదైనా జరుగుతుంది... దేవుడు మనకంటూ ఒక రాత రాసి ఉంటాడు అదిజరిగి తీరుతుంది ... దేవుడు ముడివేస్తేనే జీవితం ... అయిన మానవ ప్రయత్నం జరుగుతూనే ఉండాలి ...so నేనుప్రయతిన్స్తూనే ఉంటాను ... నాకు నచ్చినది నేను ఎలా చేస్తున్నానో , అలాగే ఎదుటి వాళ్ళకి నచ్చింది వాళ్ళు చేస్కునేస్వేచ్చ ఉంది .. అది కాదని బంధనాలు వేసే మూర్ఖుడిని కాదు అంతా సంస్కారం లేని వాడిని కాదు...
కాని being ourselves n keeping others happy అనేది బాగా నమ్మే వాడిని...
Indian Mythology , సంస్కృతి అంతా నమ్మకం పైనే సాగుతుంది .. ఆ నమ్మకాన్ని నేను పూర్తిగా నమ్ముతాను ...
చాలా చాలా ముఖ్యమైన విషయం ఏమిటంటే .. ఎవరినో పరీక్షించడానికో.. ప్రశ్నించాడనికో కా
దు ప్రయత్నం ...I am not here 4, to judge the people... మంచి, చెడు ఈ రెంటిని నేను నమ్మను ఎందుకంటే అవీ చూసే చూపుని బట్టిమారుతుంటాయి అందుకే , అందరు మంచి వాళ్ళే జరిగేది అంతా కూడా మంచిదే అదొక్కటే నమ్ముతాను ...
ఎవరు అర్థం చేసుకోక పోయిన నచ్చక పోయిన పర్వాలేదు కాని ..అపార్థం చేసుకోవద్దు .. ఇలా రాయటం నా పిచ్చినిఅంతా రుద్దటం కోసం కాదు ...
అంగడిలో బొమ్మలాట నాకు నచ్చదు కాబట్టి .. నాకు చిన్నప్పటినుండి పెళ్లి చూపులు అనే తతంగం అంటే కొంచెం భయంకాబట్టి ... ఒకరిని తీసుకు వచ్చి కూర్చోబెడితే .. సరిగా చుసిన చూడకపోయినా తలాడించి ఏదో ఒకటి చెప్పాలి ... హహ్హహ...నిజానికి అలా చెప్పాలంటే నాకు నచ్చని వాళ్ళు అంటూ ఉండరు ... ఎలా ఉంటారు ఎందుకు ఒకరు మనకు నచ్చరు చెప్పండి .. మనలాగా మనం ఎలా ఉన్నామో వాళ్ళ లాగ వాళ్ళు ఉన్నారు అంతే .. మరీ నచ్చడం నచాకపోవడం సమస్యఎక్కడ వస్తుంది .. అందుకే నాకు ఆ పద్ధతి నచ్చదు.. ఎదురుగుగా ఉన్నవాళ్లు మనకి సరిపోతారా? వాళ్ళతో కలసిమనము ఇమిడిపోగాలమా, బతకగలమా చుసుకోవలసినవి ఇవే .. అలాగని ఏదో మహారాజు లాగ కాలుమీదకాలేసుకొని ప్రశ్నలు అడిగేయటం నాకు నచ్చదు, కాని కలసి ఉండాలంటే ఒకరిగురించి ఒకరు పూర్తిగా కాకపోయినాకొంచెమైన తెలుసుకోవలనేది నా భావన .... so direct గా నావల్ల కాదు కాబట్టే ఇలా రాసాను .. భవిష్యత్తులోఅవసరమైనపుడు .. ఈ నా blog ని నా Id ని ఇస్తాను .. నా గురించి కాస్త అయిన తెలుసుకోవచ్చు కదా కనీసం నేనుఇలా ఆలోచిస్తాను అని అయిన ఒక ప్రాథమిక అంచనా ఉంటుంది కదా ... తను అడగలనుకున్నవి అడుగుతుందిచెప్పాలనుకున్నవి చెబుతుంది .... sooooo.................

inka cheppali naa blog complete ayyaka chebuthanu appativaraki please dont mind....


వరకట్నం ఇదొక సాంఘిక దురాచారం .... యదేచ్చగా సాగిపోయే అపచారం...కాని ఎవడు కాదనలేని వద్దనబోని ఒక ఆచారం ...నిస్సందేహంగా, నిర్లజ్జగా జరిగిపోయే ఒక వ్యవహారం ....

మనకి మిగతా విషయాలలో ఎంత స్పష్టత ఉందని చెప్పలేను కాని ... ఈ విషయంలో మాత్రం నాకంటూ స్పష్టమైన అభిప్రాయాలూ ఆలోచనలు ఉన్నాయి .. నేను అలా అనుకున్నాను అలా ఉండాల్సిందే ... ప్రతి సమస్యకి ముందే పరిష్కారం చూసుకునే నేను ... ఒకే విధమైన ఆలోచనతో మొండిగా ఉంటాను అనుకోవటం పొరపాటే .. కానీ నా పరిష్కారం ఏదైనా అంతిమంగా నేను , నా ఆలోచనే గెలిచే విధంగా ఉంటుంది అనేది స్పష్టం ...


అడిగితే ఇవ్వకుండా ఎలా ఉంటామనేది ఒక version అయితే .. ఇచ్చేవాడు ఉన్నంత కాలం తీసుకుంటూ నే ఉంటాము అనేది ఇంకొక version ... మరొక చిత్రం ఏమిటంటే , మేము ఇచ్చాము,మాకు కావాలి అంటూ ఒక గొప్ప న్యాయం... ఇందులోనూ మేము ఇంత ఇచ్చాము కాబట్టి అంతా కన్నా ఎక్కువ కావాలి ... ఆహ ఎం ధర్మం..సరే ఉన్నా వాడంటే ఇచ్చాడు మరీ లేని వాడి సంగతి ...చ పాతకాలం సినిమా స్టొరీ లు మనకెందుకు అనుకుంటున్నారా ,.. కాదు కానే కాదు మన ఖర్మ ఏమిటో కాని ఎన్ని మారిన .. ఈ సమాజం లో కొన్ని మారవు ..ఎందుకంటే ఆచారాలు కట్టుబాట్లు ... బుద్దిగా ఉండమని చెప్పటానికి ఇలాంటి కట్టుబాట్లు రావు .. కానీ ఇలాంటి వాటికి అయితే తన్నుకొస్తాయి మరీ ...

అయిన నాకు అర్థం కాని సందేహాలు చిన్నప్పటి నుండి చాలా ఉన్నాయి .... ఎక్కడైనా డబ్బులు పెట్టి కొనుక్కోవడం చూసాను, కాని డబ్బులు ఇచ్చి మరీ అమ్ముడుపోవడం చూడలేదు ఇదొక్కటే వింత .. క్షమించాలి ఎవరైనా ఈ మాట ని ఇబ్బందిగా ఫీలయితే ... దురాచరమో ఏంటో కాని దీనికన్న కన్యాశుల్కమే అర్థవంతం అనుకుంటా... మేము అబ్బాయిని చదివించి చేసి ఇంత కర్చు పెట్టాము కాబట్టి ఘనంగా ఇవ్వాలి అంటారు .. ఏ అమ్మాయికి కర్చు పెట్టకుండానే అన్ని అయిపోతున్నయా .. చదువు ఎవడన్న ఫ్రీగా చెబుతాడా .. ఫ్రీ గా పెరిగిపోతుందా హా ...

నా కంటూ లోకం తెలిసిన తరువాత , నా లైఫ్ లో నేను చుసిన మొదటి పెళ్లి నుండి నాకు పెళ్ళంటే కొన్ని ఆలోచనలు ఉన్నాయి అందులో మొట్టమొదటిది చాలా ముక్యమైంది కట్నం. నా వరకి నేను doury తీసుకొను ... అలాగని ఆదర్శాలు వల్లించను నాకు తెలుసు ఇదేం సంఘ సేవ కాదు, నాకు నచ్చదు కాబట్టి తీసుకొను ...అలా అని ఇలా చెప్పేసి తప్పించుకొను తప్పనిసరి అయితే తీసుకుంటాను.. మళ్ళి ఇదేం twist అనుకుంటున్నారా ..తప్పించుకోవడం ,ఇప్పుడే మాట మార్చుతుంటే ఇంకా ఎందుకు ఈ మాటలు అనుకుంటారా పర్వాలేదు ఏమైనా అనుకోండి పూర్తిగా చదివిన తరువాత అనుకోండి.. నన్నెవరు అడిగిన నేను అంటాను కట్నం ఎంత కావాలి అంటే ఒక 30 లక్షలకి తక్కువ కాకుండా ఇవ్వాలని .. అంతనా అంతా ఎందుకు అంటే ... అవును అలాంటప్పుడు ఇవ్వకుంటే బెటర్ కదా మరీ కచ్చితంగా తిస్కోవాలి అంటే పెద్ద మొత్తంలో ఇవ్వాల్సిందే మరీ అనేవాడిని .. వ్రతం చెడ్డ ఫలితం దక్కాలి కదా ..

చివరికి ఏమంటాను అంటే అసలు కట్నం ఎందుకివ్వాలి .. అందులో కూడా అంగడిలో పశువులని బేరం పెట్టినట్లు ..ఇంత ఆస్తి ఉంటె ఇంత ...ఇంత జీతం వస్తే ఇంత... ఇల్లు ఉంటె ఇంత car ఉంటె మరింత .. ఏమిటి ఈ బేరాలు అసలు మనం మనుషులమా అన్న సందేహం వస్తే .. ఒక ఇల్లునో స్థలం నో అమ్మకానికి పెట్టినట్లు ఏంటి ఇది .... నాకు ఆస్తులు అంతస్తులు చూసి కట్నాలు ఇవ్వడాలు .. పైసాకి కొరవడని దానిని చూసుకొని మురిసిపోవడం అసలు నచ్చదు ... నాకసలే అర్థం కానీ విషయం ఒకటి already కోట్లు ఉన్నవాడికి ,అమ్మాయి సొమ్ము ఎందుకండీ మళ్ళి ఎమన్నా అంటే practical గా అలోచిన్చామంటారు... అమెరికాలో నెలకు రెండు లక్షలు సంపాదిస్తే కోటి రూపాయలు కట్నం ఇస్తారా .. మరీ వాడు సంపాదించింది ఎవడికి పెడతాడు .. 5 ,6 కోట్ల ఆస్థి ఉన్నవాడికి 50 లక్షల కట్నం ఇస్తే మరీ వాడి ఆస్థి ఎందుకు ఇంకా .. ఇలా ఇస్తారు కాబట్టే వాడికి డబ్బులు ఎక్కువయి ఎం చేయాలో తెలియక ఎక్కడో పాతరేస్తడు ... మళ్ళి మొదటికి వచ్చి గొడవ పెడతాడు ..అందుకే రోజు T V లలో బాగోతాలు కనిపిస్తున్నాయి (నేను అందరిని అనడం లేదు కానీ అమ్మాయిల parents ఆలోచన కూడా మారాలని ). ఆస్తులు చూసి ఇస్తామంటే రేపు ఎవడు ఎలా ఉంటాడో ఎవరు చెప్పగలరు.. అమ్మ ననన్ సంపాదించిపెట్టిన వాడు పోగొట్టుకోదని guarantee ఏంటి .. చిన్నగా మొదలెట్టిన వాడే కోట్లు సంపాదించాడని guarantee ఏంటి.. ఇపుడు నా జీతం పదివేలు అని ఇంతే ఇష్టం అంటే ..పెళ్ళయాక రెండేళ్ళకి 50 లేదా 70 వేలు సంపాదిస్తే కట్నం పెంచుతార ... హా తరువాతది లెక్క ఉండదు .పెల్లపుడు ఎంత ఉందొ అదే లెక్క అంటారా .. ఇదేమన్న realestae వ్యాపారమా IT బూమ్ నా ... మనుషులతో వ్యాపారమా ఛి ఛి ....
నన్ను అడిగితే ఆస్థి పాస్తులు లేని బుద్దిమంతుడికి ఇలా డబ్బులు దార బోసిన, వాడు సద్వినియోగం చేస్తాడు .. వాడికి కృతజ్ఞత ఉంటుంది అమ్మాయిని మహారాణిల చూసుకుంటాడు ఆ డబ్బుతో ఏదన్న పని చేసి బాగుపడతాడు ....తండ్రులు సంపాదించింది కర్చు పెట్టేవాల్లకి ఇచ్చిన విలువ సొంతంగా సంపాదించే వాళ్ళకి ఎందుకివ్వరో మరీ .... మా అన్నయనే తీసుకుంటే 4000 జీతంతో మొదలు పెట్టి లక్ష కట్నం తో కూడా సొంతగా ఇల్లు car సమకూర్చుకున్నాడు, ఇలాంటి వాళ్లకి ఆ కట్నం లాంటివి ఇస్తే , దర్జా జీవితం చూపిస్తారు కదా మరీ, కాని నమ్మదు కదా లోకం. ఇలా ఏ ఒక్క డబ్బున్న వాడి విషయం లో అన్న అయిందా .. ఉదాహరణకి కూడా దొరకవు ... బాగా ఉన్నా వాడికే ఇంకా ఇస్తే ఏమి లాభం ... మనిషిని నడిపించేది ప్రేమ కాని డబ్బు కాదని తెలుసుకుంటే సగం లోకం బాగుపడుతుంది ...

ఇక నా విషయం అంటారా .. చదివారు కదా కట్నం అంటే మనకి అలాంటి అభిప్రాయం ఉంది. అందుకే నేను అసలు తీసుకొను .. మా అన్నయే ఎక్కువ తీసుకోలేదు, నాకు ఎందుకు ....అది ఇంట్లో కూడా అనేసాను కాని ఏదో కొత్త వాదన తీసారు అది prestige అట , తీసుకోక పోతే ఏదో లోపం ఉంది అంటారట .. నిజమే కొందరి విషయాలలో నేను కూడా విన్నాను .. అందుకే తప్పదన్నపుడు తీసుకుంటాను .. కాని నేను గెలవాలి కదా అందుకే అది పూవుల్లో పెట్టి మళ్ళి వెనక్కి ఇచ్చేస్తాను సమయం వచ్చినపుడు .. కొంచెం clear గా చెబుతా wait ..
అంటే నాకు అమ్మాయి బాగా suit అయి పాపం మా మామ డబ్బులు ఎక్కువ లేనివాడు అనుకోండి , అపుడు fighting చేసి అయిన కట్నం తీసుకొను అపుడు కూడా అయన prestige అంటే అయన ఖర్మ నేనేమి చేయలేను .. అప్పులు మాత్రం చేయనివ్వను .. ఎందుకంటే తరువాతి కష్టాలు ఎలా ఉంటాయో నాకు తెలుసు .. మనం అనే ఒక కొత్త మనిషి వాళ్ళ జీవితాలలోకి వస్తున్నదంటే సంతోషంగా ఫీలవ్వాలి కానీ భారంగా కాదు ... నేను నా కోసం మా నాన్న అప్పు చేస్తేనే ఒప్పుకోను మా నాన్న డబ్బులు తిసుకోవడానికే ఆలోచిస్తాను అలాంటిది ... అవసరం లేకపోయినా నా కోసం అప్పు చేసి కష్టపడతాను అంటే ఎలా ఒప్పుకుంటా ..... మనం సంతోషంగా ఉండటానికి ఉపయోగపడని , హ్యాపీగా ఉండనివ్వని prestige లు పట్టింపులు అంటే నాకు చిరాకు ....

ఇక పాపం మా మామ బాగా ఉన్నవాడు అయితే కూతురికి కట్నం ఇవ్వడం గొప్పతనం గా భావిస్తే ,అలాగేతీసుకుంటాను .. కాని అందులో ఏమైనా కర్చు పెట్టిన మళ్ళి వాటిని కలిపి మళ్ళి తనకే ఎపుడో అవసరం అయినపుడు ఇస్తాను .. ఇక్కడ లెక్కలు లేవండి తీసుకొని ఇవ్వడం ఏంటి అని .. తనకి డబ్బు ఎంత ముఖ్యమో తెలిసే రోజు వచ్చినపుడు ఇస్తాను అంటున్నాను .. అలా తీసుకోకపోతే ..... ఆహా ఎన్నాళ్ళ నుండో కల గంటున్న కదా అది నిజం చేస్తా అదే డబ్బుతో ఒక అనాధ శరనలయమో ఇంకేదో ఉపయోగపడేలా అయన పేరు మీదనే కట్టిస్తాను, అంతే కాని కట్నం అనే పేరుతో వచ్చిన ఒక్క రూపాయి కూడా నేను వాడుకోను,ఇక్కడేదో నేను కట్నం తీసుకోలేదు ఆదర్శ పురుషుడినిఅని చెప్పుకు తిరగడానికి కాదు , నాకు ఇవ్వకపోయినా , బాగా కట్నం ఇచ్చాము అని చెప్పుకున్న పరవాలేదు పరువుకోసం అనుకుంటే కానీ ఇవ్వకుండా ఉంటె చాలు ..... ఇది fix

నేను ఇప్పటివరకు ఎలా అనుకున్నానో అలాగే ఉన్నాను ... నిజయితిగానో లౌక్యం గానో కాని అనుకున్నది అనుకున్నట్లే చేశాను ఇప్పుడు అలాగే చేస్తాను .. అందులో మార్పు ఉండదు ... అందుకే చెప్పా సందర్భాన్ని బట్టి ఎంత మారిన .. నాలో మనిషి మారడు వాడు చేసేవి మారవు ... అందుకే అనుకున్నవి చేసి చూపిస్తా అది అంతే .. నాకు మాటలు చెప్పడం అలవాటు అవి చేసి చూపించడము అలవాటే ... నేను mind లో fix అయ్యాను అంటే అలా చేయాల్సిందే అంతే ...
అందుకే ఆస్థి పస్తులు, డబ్బు తో ప్రమేయం లేని ..మనస్పూర్తిగా నమ్మే ప్రేమని నమ్మకాన్ని కోరుకుంటాను నేను ...నన్ను నమ్మితే ఎంతైనా ఏదైనా చేస్తాను .. నమ్మకంకోసమైన చేస్తాను అంతే ....


చివరగా తనే నాకు పెద్ద బహుమతి కావాలి కాని ఇవన్ని ఎందుకు ........

" Wherever there is a human being, there is an opportunity for kindness".
మనకి ఏ సంబంధం లేని వాళ్ళ కోసం మనం ఆరాట పడటంలో, సహాయపడటం లో మన మనసు ఎలాంటిదో తెలుస్తుంది ... ఎంత సున్నిత తత్వమో అర్థమవుతుంది ... సహాయం చేయకపోయినా పర్వాలేదు చేయాలన్న ఆలోచన వచ్చిన చాలు ..గొప్ప విషయమే ,ఎదుటి వాళ్ళ బాధని చూసి స్పందిస్తే చాలు అది ఓ మనిషి గుణమే... దీనినే మానవత్వం అంటే ... ఆ మానవత్వం అందరికి ఉండాలనేది నా అభిమతం ...... మనకోసం మనం కాకుండా ఇతరుల కోసం జీవించడంలో ఒక చెప్పలేని అనుభూతి ఉంది

If you want happiness for an hour, take a nap.

If you want happiness for a day, go and play Cricket.

If you want happiness for a year, inherit a fortune.

But if you want happiness for a lifetime, help somebody.


గొప్పవాళ్ళు కావడానికి సేవచేయల్సిన అవసరం లేదు .. పేరు కోసం సహాయపడటం నాకు నచ్చదు
మన వల్ల ఒకరు మనస్పూర్తిగా సంతోశిస్తున్నారంటే చాలు .. ఆనందంతో వాళ్ళు కార్చే ఓ కన్నీటి బొట్టు చాలు ఆ ఆప్యాయత ఏంటో తెలియడానికి.. మన వల్ల ఒకరు కష్ట పడకపోతే ,మనం ఒకరి కన్నిళ్ళకి కారణం కాకపోతే చాలు ... లోకాన్ని ఉద్దరించాలనేది నా అభిప్రాయం కానే కాదు .. ఉన్నదంతా ఊడ్చి పెడుతూ, అందినంత దండుకునేవాడికి సహాయపడమనేది నా విన్నపం కానే కాదు ... ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టలేక పోయిన గుక్కెడు గంజి పోసినా , వాడు సంతోషిస్తాడు అనేది నా సిద్ధాంతం ... నా జేబులో 101 రూపాయి ఉన్నపుడు నేను అందులో ఒక్క రూపాయిని సహాయం చేయడం లో .. దాతృత్వం లేదు, మానవత్వం అంతకన్నా లేదు .. మనిషిగా చిన్న స్పందన తప్ప ... అదే నేను చెప్పే సేవ, చేసే సేవ మాట్లాడే సహాయం ,,,
ఆకలితో ఉన్నవాడి కళ్ళలో ఆనందం చూడటం ... చదువు కొనలేక ఆత్మహహ్యలకు పాల్పడే వాడిని ధైర్యపరచటం ... అపర జ్ఞానాన్ని డబ్బులేదనే సాకుతో వృధా పోకుండా చూడటం .. చేయి చాచి అర్థించిన వాడిని ఆదుకోవాలనే మనసు ఉండటం, ఇవన్ని మనం చేసే త్యాగాలు కాదు .. మనుషులుగా మన కనీస బాధ్యతగా చేసేపనులు..
నా దగ్గిర 10 రూపాయలు ఉన్నపుడు, ఉన్నవన్ని నేను donate చేయలేను .. అంతా మంచివాడిని కూడా కాదు నేను, అది నాకు తెలుసు .. కానీ నా దగ్గిర 1000 రూపాయలు ఉన్నపుడు కూడా పది రూపాయలిచ్చి ఆదుకోలేకపోతే నా మనసు ఊరుకోదు....
నాకు ఇలాంటి పనులు చాలా ఇష్టం ... నిజానికి నేను ఇంతవరకు ఎక్కువగా చేయలేదు ఎప్పుడో చిన్న చిన్నగా తప్ప .. కాని ఇప్పుడు నేను చేయకపోయినా .. నన్ను చేసేలా ప్రోత్సిహించాలి , చేయుతనివ్వాలి .. ఎందుకంటే ఇన్నాళ్ళు కొన్ని కారణాల వల్ల నేను సీరియస్ గా చేయలేకపోయానేమో కాని చేయాలన్న తపన నాలో చాలా ఎక్కువే... ఇన్నాళ్ళు మొహమాటం అడ్డం వచ్చింది ..సంపదిన్చాకే చేయాలన్న అభిమానం అడ్డం వచ్చింది .. నేను సంపాదించుకున్నది నన్ను ఉద్దరించుకోవడానికే సరిపోతుంది అన్న ఆలోచన ఆపి ఉండవచ్చు .. చేసిన కొంత సహాయం అయిన నేను స్వయంగా సంపాదించినదే కానీ .. అమ్మ నాన్న కస్టపడి పెడితే అప్పనంగా దానం చేసే రకం కాదు నేను .... అలాగని ఆదర్శాలు వల్లించే రకం కూడా కాదు.. నాకు చేయాలి అనిపించింది నేను చేస్తున్నాను .. మిగతా వాళ్ళ సంగతి నాకు తెలిదు .. కానీ నాతో జీవితమంతా ఉండేవాళ్ళకి తప్పదు నా యోచనలో సగం నా పాపం లో సగం కాబట్టి హహహహ్హ

అసహయులని , అచేతనంగా ఉన్నవాళ్ళని చూస్తే ఏదో తెలీని ప్రేరణ మొదలవుతుంది లోలోపల .. డబ్బులు లేకుండా చదువుకోసం ఇబ్బంది అదే వాళ్ళని చూస్తే అపుడపుడు కళ్ళు చెమర్చుతాయి కూడా ... అందుకే నా లోపలి మనిషిని సంతోష పెట్టాలనే నా స్వార్థం తోనే కాని నేనేదో త్యాగాలు చేస్తున్నా సేవ లో తరించి పోతున్న అన్న భావన నాకేనాడు ఉండదు .... అందుకే ప్రచారం లేని ప్రయత్నం ఉండాలి ...
నన్ను అందరు సాధారణం గా పిసినారి అంటారు .. నిజమే కావొచ్చు కానీ నా దగ్గిర డబ్బులు కుప్పలుగా ఉండవు అలాగని ఊరకే కూర్చునే రకం కాదు.. సంపాదించటం, అవసరం అన్నవాడికి కష్టంలో ఉన్నాడు అనుకుంటే ఇచ్చి సంతోషించటం (మళ్ళి తిరిగి తిస్కుంటాను అనుకోండి కానీ .. అనవసరమైన కర్చులకన్నా అవసరానికి ఆదుకోవడమే గొప్ప అనుకుంటాను) నా అలవాటు .. ఫ్రెండ్స్ పార్టీ అడిగితే కూడా, ఆ డబ్బులు ఏ అంధ శరణాలయం లోనో , అనాధ శరణాలయం లోనో donate చేయవచ్చు కదా అని ఆలోచించే రకం నేను ... అనవసరంగా కర్చు పెట్టను అలాగని అవసరం లో అబద్దలడాను ... నా వల్ల కాని భారాన్ని నేను మోయను .. నా వల్ల అయ్యే సహాయాన్ని చేయకుండా ఉండను ..
హహహ్హ ఇదేం పిచ్చి అనుకోవచ్చు కాని చెప్పానుకదా నేను ఏది నమ్మిన అది మొండిగా చేస్తాను .. నేను పీకల్లోతు కష్టాలలో ఉండి ఒక్కరు సహకరించిన బావుండు అనుకున్నపుడు నాకు ఎవరి సహాయం లేదు .. ఫీజులు కట్టకుండా ఎవరి హెల్ప్ లేకుండా నేను పడ్డా కష్టాలు నాకు తెలుసు అందుకే ఎవరన్న అలా కష్టపడితే నాకు నచ్చదు ..అందుకే instant గా అయిన హెల్ప్ చేసి సంతోషిస్తాను .... మొత్తంగా మన mentality ఏంటంటే కడుపు నిండా తిన్నవాడికి పంచభక్ష పరమాన్నాలు పెట్టిన ఏదో ఒక లోపం చూపించి తిట్టి పొవచ్చు కాని .. ఆకలితో అలమటిస్తున్న వాడికి కారం మెతుకులు పెట్టిన మహాప్రసాదం ల చూస్తాడు, అది matter ..... నేను ఎవడికి కర్చు పెట్టనని నన్ను పిసినారి అన్న వల్ల కన్నా, నేను హెల్ప్ చేసినపుడు థాంక్స్ అనుకున్న వల్లే ఎక్కువ ... ఇక్కడ ఒక్కటి గమనించాలి, నేనేదో 1000 కర్చుపెట్టి పార్టీ ఇస్తే ఎవడికి గుర్తుండదు డబ్బులు ఒవడం తప్ప .. ఇలా అయితే మళ్ళి నా డబ్బులు నాకే ఇస్తారు, కానీ వాడికొక హ్యాపీ హహహః అది సంగతి మరీ అవసరానికి, సహాయానికి ఉన్నా పవర్ అలాంటిది ...
అందరు కలసి తిరేగేటపుడు , టీ లు తాగేటపుడు, పార్టీ చేస్కునేటపుడు తెగ friendship ఫీలవుతారు ... కానీ పీకల మీదికి వచ్చినపుడు ఎవడు పట్టించుకోడు, బాధల్లో పక్కన ఉండటమే నిజమైన స్నేహం .. అవసరం లో ఆసరాగా ఉండటమే స్నేహం అని నమ్ముతాను నేను .. అలాగని ఎవడికి పడితే వాడికి చేస్తాను అనుకోవద్దు దానికి అర్హత ఉండాలి ..

ఇక ఈ అన్నదానాలు అవి నాకు కొంచెం నవ్వు తెప్పిస్తాయి ............ ముఖ్యంగా దేవాలయాలలో అన్నదానాలు అంటారు .. బాగా ఇంట్లో పరమాన్నాలు తినగలిగిన వారే తింటారు అక్కడ, ఎమన్నా అంటే దేవుడి ప్రసాదం అంటారు ..మిగిలితేనే పాపం అక్కడ అడుక్కునే వాళ్ళకి భిక్షగాల్లకి పెడతారు .. ఇల్లాంటి వాటిని దేవుడు హర్షిస్థాడా... ఇంట్లో మూడు పూటల తినగలిగిన వాడికి ఎందుకు అన్నదానం .. లేని వాడికి తినలేని వాడికి ఒక్క పుట కూడా సరిగా తిండి దొరకనివాడికి పెట్టాలి కాని .. దేవుడి ప్రసాదం అంటే గుడిలో పూజ సమయంలోనే పెడతారు కదా సరిపోదా ...

social service విషయంలో నాకు కొన్ని ఆలోచనలు ఉన్నాయి.. ఇందుకోసం నేను orkut, mail, blog, లాంటివి ఉపయోగించుకుంటాను .. ఇంకా ఫ్రెండ్స్ తో కలిసి community రన్ చేయాలనేది నా ఆలోచన... ఎందుకంటే నా ఒక్కడితోనే అంతా కాదు కాబట్టి .. కావాల్సిన సహాయమంత అందించడానికి నేను కోటిశ్వరుడిని కాదు కాబట్టి .. అందరిని కలుపుకొని అందరిలో ఒక్కడిగా సహాయపదలనేది నా కోరిక.. దానికి పెద్ద process నే నా mind లో ఉంది .... ఇందుకోసం నాకు తన హెల్ప్ కావలి ఒక వేళ నేను busy ఉంటె తను చూసుకోవాలి .. తన పనులు నేను చూసి పెడతాను అనుకోండి .. మొత్తంగా తనకి interest ఉండాలి ఇలాంటి వాటిపై ..లేకున్నా కలిగించుకోవాలి నా కోసం ..... తనకి చాలా సున్నిత మనసు ఉండాలి, స్నేహభావం ఉండాలి అపుడు ఇది పెద్దగా కష్టం కాదు ..

ఇక ఇంట గెలిచి రచ్చ గెలవాలన్నది నా policy ..
అందుకే ముందు నా ఫ్యామిలీ తర్వాత others .... గతం లో నాకున్న కొన్ని అనుభవాల దృష్ట్యా, ఇంకా నాకున్న కొన్ని ఆలోచనల ప్రకారం నా salary 1yr నుండి 2yr వరకు మా అమ్మ నాన్నకి, పిల్లల పేరు మీద deposit చేయాలన్నది చాలాకాలంగా నా ఆలోచన ... వారి వారి ఆరిగ్యం మరియు చదువుల అవసరాల కొరకు, అదేంటి వాళ్ళ parents అది చూసుకుంటారు కదా అనుకోవచ్చు .. చెప్పాను కదా ఇవి deposit గానే ఉంటాయి , అలాంటి అవసరం ఏదైనా వస్తే ఇవ్వడానికి అంతే..నా చుట్టూ ఉన్నా ప్రపంచం మరో ప్రపంచంలోకి దుసుకుపోవాలి కానీ ఏ కారణం వాళ్ళ ఎక్కడ ఆగిపోకూడదు అనేది నా అభిమతం ... ఇంకా detail గా clear గా అర్థం కావాలంటే నాతో మాట్లాడి తెలుసుకోవాల్సిందే అన్ని ఇక్కడే చెప్పడం కష్టం కదండీ ...

ఇంకా ఈ శరణాలయాలు, వ్రుద్ధాశ్రామాలలో, అలాగే పేదలకు అన్నదానాలు , సహాయం చేయడాలు లాంటివి , పిల్లల్ని కలుసుకోవడం వాళ్ళ మద్య గడపడం లాంటివి కొంచెం ఇష్టం అనుకోండి కాని ఇప్పటివరకు చేయలేకపోయాను .. తర్వాత ఎలాగైనా చేయాలనీ ఆశ .. ఇక్కడ కూడా నాకు ఒక ఆలోచన ఉంది .. పెళ్ళిలలకు వచ్చేసరికి ,మనం మనంగా ఉండి ఒంటరిగా ఉన్నపుడు చచ్చామో బతికామో కూడా చూడని బంధువులందరి మెప్పు కోసమని లక్షలు కర్చు పెట్టి ఆడంబరాలు చేసి తీర వాళ్ళ తిట్లు, పెదవి విరుపులు భరించడం కన్నా , అక్కడేదో చేసామా అంటే చేసామా అన్నట్లు కానిచ్చేసి మనల్ని మనసారా దీవిస్తూ ఉండే చోట, కడుపు నిండా ఒక్క రోజు ఒక్క పూట అయిన తిండి పెట్టాలని ఒక పిచ్చి కోరిక .. ఇది ఎంతవరకు ఎందరు సమర్థిస్తారో తెలిదు కాని .. నా పెళ్ళిలో పెద్దల వరకి వాళ్ళ పద్దతిలో ఆడంబరాలు చేసుకున్న .. నాదంటూ సంపాదన నుండి( తనది నా mentalty నే అయితే తనది కలపి) కనీసం ఒక 50 మందికి అయిన నిజంగా ఆకలితో ఉన్నవారికి , విందు భోజనం కాకపోయినా మాములు భోజనం అయిన పెట్టాలని ఆశ .. అపుడే దేవుడు కూడా మనస్పూర్తిగా దీవిస్తాడని నా నమ్మకం .....

చివరగా ఒక మాట ఒక మనిషి సగటు జీవిత కాలం 60-65 సంవత్సరాలు అనుకుంటే .. ఇంకా మనకున్నది 35-40 అంతే .. ఇందులో అన్ని పోను కరెక్ట్ గా బతికేది ఒక 15 సంవత్సరాలు ఉండవచ్చు .. ఈ కాస్తలో మన కోసం కాకుండా ఎంత కాలం బతికాము అన్నదే అర్థవంతం ... గెలవటం కన్నా గెలిపించటం లో మజా ఉంది అది అనుభవించటం నేర్చుకోవాలి అంతే ...........

చివరగా ఒక్కమాటలో .. సేవ చేయడానికి ప్రోత్సహిస్తాను అలాగే నేను చేస్తాను .. నా salary లో 5-10% ఇందుకోసం కేటాయిస్తాను తను ఇంకా నాకన్నా మంచిదై ఇంకా ఎక్కువ donate చేద్దాం అంటే ..ఇంకా చాలా సంతోషం ...

ఈ విషయాలలో నేను చెబుతూ పోతే .. end అవడం కష్టం కాని ఇంకా చాలా చాలా ఉందీ.. ఎలాంటి అనుమానాలు అపోహలు లేకుండా .. మాట్లాడుకున్నపుడు వివరణాత్మకంగా చెప్పడానికి వీలుంటుంది .. basic గా నా ఆలోచన ఇలా ఉంటుందని చెప్పడం అంతే ....









ఈ ప్రపంచం లో ప్రేమలు చాలా వరకు గుడ్డిగా పుట్టి గుడ్డిగా పెరిగేవే ..కాని గుడ్డిగా నిలబడేవి.. అంతే గుడ్డిగా కొనసాగేవి మాత్రం కాదు ..ఏదో ఒక త్రుష్ణలో మొదలై కొన్నాళ్ళు అంతా మనదే అంతా మనమే అన్నట్లు కొనసాగి.. రంగుల లోకం లో విహరిస్తూ సాగి పోయే ఓ అందమైన అనుభూతి.. కొదరికి ఇది కొన్నాళ్ళ ముచ్చటే.. అవంతారాలతో అన్ని మర్చిపోయే వాళ్ళు కొందరైతే .. రంగుల లోకాన్ని జయిన్చేస్తామని సాహసాలు చేసి నిలిచేవాళ్ళు కొందరు .... కాని అందత్వంలో నుండి వెలుగులోకి వచ్చాక కొన్నాళ్ళు బాగానే ఉన్నా.. ఉహించుకున్నన్ని రంగులు ఇక్కడ లేవని ఫరిదులు తప్ప పదనిసలు లేవని బ్రతుకు పోరాటాలు ఆరాటాలు తప్ప బ్రహ్మాండాలు లేవని బ్రహ్మలు వీడే నాటికీ ..ప్రేమలు తెలివు అనుభూతులుండవు .వాస్తవం అర్థమయ్యాక రంగులు మారి లోకం చీకటైన ఆశ్చర్యం లేదు .
అలాంటివాటి కంటే అబద్దం లో నుండి పుట్టే ఓ అందమైన అనుభూతే మేలనుకునే తత్వం నాది.. ఓ అందమైన వనం లోకి వెళ్తూ ఆనందాన్ని కలిగించే ఎన్నో దృశ్యాలని expect చేస్తాం తీర లోపలకు వెళ్ళాక ముళ్ళ పొదలుంటే మనల్ని మనమే తిట్టుకుంటాం అక్కడికి వెళ్ళినందుకు ... అదే ఒక గుహలోకి వెళ్తూ భయంగానే అడుగులేస్తము ఏమున్నాయో ఏముంటాయో తెలీకుండా ..తీర వెళ్ళాక భంకరమైన దృశ్యాలు ఉంటె మానసికంగా సిద్దమై ఉన్నాము కాబట్టి మనకి పెద్దగ భయం ఉండదు ..కానీ అందమైన అనుభూతులు ఎదురైతే అదొక గొప్ప వరంగా భావిస్తాం .... అలాంటి జీవితం కోసమే ఈ తపన .
ఎడారిలో వెళ్తున్నపుడు అసలేమీ దొరకక అల్లాడిపోతున్న సమయంలో ఒయాసిస్సు కనిపిస్తే జీవితలో ఎప్పుడు లేనంత సంతోషం దానిని ఒక గొప్ప వరంగా భావిస్తాము అలా అని అక్కడే ఇల్లు కట్టేస్కోని ఉండి పోతామా లేదు కదా .. అదే ఒక నది ఒడ్డున అయితే ఇల్లే కాదు జీవితం అంతా అక్కడే ఉండిపోమ్మన్న ఉండిపోతం ఎందుకంటే అది మనం వద్దనుకున్న మనక్కావల్సినవి ఇస్తుంది కాబట్టి... ఆకర్షణతో పుట్టే ప్రేమ అలాంటిదే ఒయాసిస్సుల ఆనందాన్ని ఇచిందని అక్కడే ఆగిపోలెం .. ఇంకా మనల్ని మనకన్నా ఎక్కువ ప్రేమించే వాళ్ళు ఉన్నారని మరచిపోలేం .. అమ్మ నాన్న జీవితమంతా కంటికి రేప్పెల కపుడుకునే ప్రేమ రూపాలు వాటిని మనం తక్కువ చేయలేము తుంచి వేయలేము ఆ ప్రేమ తరువాతే అన్ని ప్రేమలు ...

అలా అని నాకేదో ప్రేమ పై మంచి అభిప్రాయం లేదని అనుకోవద్దు ..అందరు నవ్వినా నేను ఎప్పుడే చెప్పేది ఒక్కటే ప్రేమ అనేది పార్కుల్లో కనిపించేది కాదు..." తల్లిలో, తండ్రిలో , గురువులో , స్నేహితుల్లో " ఇలా ప్రతి చోట మనం మనస్పూర్తిగా feel అయ్యేది ప్రేమే కదా . I like divine LOVE మనల్ని మనంగా ఆస్తులు అంతస్తులకు సంబంధం లేకుండా ..బాదలోను, భయంలోను గెలుపులోను ,ఓటమిలోనూ నేను ఉన్నాను అనే భారోసనే ప్రేమ అది ఎవరిదీ అయిన ఒక్కటే అనేది నా అభిప్రాయం. ప్రతి మనిషిలోను ప్రేమ ఉంటుంది అది పరిస్థితులను బట్టి బయటకొస్తుంది .. right time లో వస్తేనే దానికి విలువ ... ప్రతి అడ్డమైన ఆకర్షణకి ఆనందానికి ప్రేమ అనే పేరు పెట్టడం ????.........????
గమ్యంలో ఒక డైలాగ్ చాలా ఇష్టం .." ప్రేమని ప్రేమించిన ప్రేమ ప్రేమకై ప్రేమించిన ప్రేమని ప్రేమిస్తుంది ".

అందుకే నన్ను నన్నుగా ప్రేమిస్తూ నా చుట్టూ ఉన్నవాళ్ళని ప్రేమిస్తూ ..ప్రేమకి సరైన అర్థం చెప్పే వాళ్ళ కోసమే నా ఈ ప్రయాణం .... చేడులోను మంచిని చూడాలి .. ఆకలి అర్థాన్ని, సేవ విలువని తెలిసి ఉండాలి పక్కవాళ్ళ సంతోషం కన్నా వాళ్ళ బాదని ఎక్కువగా ప్రేమించాలి .. దేశాన్ని ఉద్ధరించక పోయిన పర్వాలేదు చేతనైన సహాయం చేయడంలో ముందుండాలి, చేసేవాళ్ళని అడ్డుకోవద్దు ఆసరాగా ఉండాలి అనే విచక్షణ ఉండాలి .... సహాయ పడటాన్ని సేవ చేయటాన్ని నాకన్నా ఎక్కువ ప్రేమించాలి ... హహహ చివరగా వీడి పెళ్ళాం వీడికన్నా different అనుకోవాలి అంతా ...హహహ్హ .. నేనెపుడు చెప్పే ఒక మాట తరచి చూస్తే ప్రతి మనిషిలోను మంచివాడున్నాడు ఎవరైనా జీవితం అనే వేదిక పై తమ పరిదిలోపే నటిస్తారు .........
హృదయం అందరికీ ఉంటుంది ప్రతి హృదయం స్పందిస్తుంది
కాని, ఇతరుల అవసరానికి స్పందించే హృదయం కొందరికే ఉంటుంది
అలాంటి కొన్ని హృదయాల తపన లో నుండే ప్రేమ పుడుతుంది
స్పందించే ప్రతి హృదయo లో ప్రేమ ఉంటుంది .. అలా స్పందించే ప్రేమే ఉన్నతం ...



ప్రేమ మనసులో వుంటుందా..? మనిషి లో వుంటుందా...? మాటల్లో వుంటుందా...?

నేస్తం..! ప్రేమ లేని చోటు అంటూ వుండదు..
తన కోసం వేచి చూసే కన్నులో ప్రేమ వుంటుంది.
పరుగులు తీసే పిల్లగాలికి చల్లనైన మల్లెల శుఘంధమంటే ప్రేమ. పగలంతా పడిన అలసటకికమ్ముకోచే చికటంటే ప్రేమ. నేర్రాలే నగలైన నెలకి ఒళ్ళంతా తడిమే జల్లంటే ప్రేమ.
ప్రతి చిగురికి పచరంగుని పూసే ప్రకృతికి పచ్చధనమంటే ప్రేమ. మన చుట్టూ ప్రేమ కనిపిస్తుంటే ప్రేమని అక్కడో , ఇక్కడో మాత్రం చెప్పలేము..
ప్రకృతిలోనే కాదు... మనలో, మన మనసులో, మన మాటల్లో ప్రేమ వుండాలి.

నిలోను , ని మనసులోనూ, ని మాటల్లోనూ... అన్నింట్లోనూ కలగలిసి వుంటేనే అది నిజమైన , పరిపూర్ణ మైన ప్రేమ..

సఖి సినిమా అంటే నాకు పిచ్చి ఇష్టం అందులో ప్రేమ ... divine love నిజంగా అలాగే ఉంటుందేమో అన్నట్లు ఉంటుంది ..ఒకరిని ప్రేమిస్తే వాళ్ళ plus & Minus లని కూడా ప్రేమించాలి చచ్చేదాకా అలాగే ప్రేమించాలి అందుకే ఆ సినిమా అంటే అంత ఇష్టం.....
అమ్మాయి అంటే ఆనంద్ సినిమాలో రూప లాంటి ఓ మంచి కాఫీ లాంటి అమ్మాయి ... గోదావరి లో సీత లా చక్కనైన చుక్క...... ఇంకా గమ్యం లో సీతలాగా ఉండాలి అచ్చం అవే భావాలూ ... క్యారెక్టర్ హెల్ప్ చేయాలనే కోరిక తపన ఏదో సాదించాలనే తపన .. నేను అంటే ఎక్కడలేని ప్రేమ హహ్హహ అన్ని అలాగే ఉండాలి. ఇంకా చాలా సినిమాలు ఉన్నాయనుకోండి ఇవి just examples
నువ్వేనువ్వే లో ని Father Love , నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్ లోని best love ఇంకా ఇలా చాలా .... ఆ నలుగురు హృదయాన్ని తాకింది .. అల బతకడంలో ఓ సంతోషం ఉంది మానసిక సంతృప్తి ఉంది
ఇదంతా చూస్తే నా పై కొంచెం సినిమా ప్రభావం కూడా ఎక్కువే అని అర్థమవ్వాలి కదా .. ఎక్కడ నుండైన నాకు మంచి అనిపించింది నచిన దానిని తిస్కోవటం అలవాటు....
just డార్లింగ్ సినిమా చూసాఅందులో ఒక పాయింట్ నిజంగా పిండేసింది అనుకోండి .. అమ్మాయిలంతా చూడాలి ఆ సీన్ మళ్ళి మళ్ళి ... అందరికన్నా చివరకు parents important ఎందుకంటే వాళ్ళలమనల్ని ఎవరు ప్రేమించలేరు ఈ సృష్టిలోనే ..... ఇంకొక మాట ప్రేమ దానంతట అదే పుట్టాలి చెప్పకుండానే తెలియాలి అది నిజమైతే హహహః ... అదీ సంగతి ..
నేనెపుడు అనుకునే వాడిని నా ideas సినిమాల్లో ఉండేవి సినిమాలగా వచ్చేవి... హహహః నా బుర్ర కూడా బాగానే ఉంది అనుకునేవాడిని
కాని amazing ఇప్పటివరకు ఏమో కానీ " వరుడు " సినిమా చూసాక అనిపించింది ... పెళ్లి సీన్ వరకు నా మైండ్ ని కాపీ చేసాడేమో అన్నట్లు ఉంది హహ్హహ ఎక్కువైంది అనుకుంటున్నారా నా స్థానంలో ఉంది ఆలోచిస్తే అలా అనిపించదు.... నా బ్లాగ్ స్టార్ట్ అవ్వడానికి నేను ఈ profile పెట్టడానికి కారణం ఏంటో తెలుసు అది ఇక్కడ స్పష్టంగా చెప్పాను.... కాబట్టి నేను ఉరికే అన్నాను అనుకుంటే నేను రాసిందే సాక్షి .... కరెక్ట్ గా చూస్తే నేను బ్లాగ్ మొదలు పెట్టేనాటికి అసలు వరుడు సినిమా అనేదే లేదు...... so నా ఆలోచన తర్వాతే అది సినిమాలో వచ్చింది ..............

నిజంగా పెళ్లి అనేది ఒక గొప్ప అనుభూతి అది ఒక్కరోజులో ఒక్క గంటలో అయిపోయేది కాదు జన్మంతా కలసి ఉండాలంటే ఎన్ని ఉండాలి ఎన్ని కుదరాలి ఎన్ని నచ్చాలి కదా ... ఆ అనుభూతిని మిస్ అవ్వకుదడనే నా తాపత్రయం ... నాది same thought ,arranged అని కాదు Love marriages అని కాదు ఎదుటి వాళ్ళని మనం ఎంత బాగా అర్థం చేసుకున్నాము అన్నది ముఖ్యం .... ఎంతలా ప్రేమిస్తున్నాం ఎంత బాగా కలిసున్నాము అన్నది ముఖ్యం. నాది సినిమాలో same Attitude అయిన ... ఇక్కడ నేను కూడా వధువుని వెతుక్కునే పనిలో ఉన్నాను కదా ..కనుక కొంచెం తేడా ... అంటే సినిమాలోలా కరెక్టుగా సెట్ కాకపోవచ్చు కదా ..చూడకుండా అలా అంటే ...... కాని నేను చూసుకున్న నాకు నచినా ఆ అమ్మాయి మా అమ్మ నాన్నకి నచ్చాలి కచ్చితముగా ... మా అమ్మ నాన్న చూసినా నాకు నచ్చాలి sure గా .
కాని ఇక్కడ కొంచెం తేడా .. చివరి వరకు చూడకుండా ఉండటాలు ఇక్కడ ఉండవండి ఎందుకంటే సినిమాలోల అన్ని కుదరవు కదా .. మన డైరెక్టర్ అన్ని మనకు అనుకూలంగా ..సరిపోయేలా create చేయదు కదా .. కనుక కేవలం ఒకరి గురించి ఒకరు తెలుసుకొని ఒక primary understanding వరకు మాత్రం ఈ సోది .. తర్వాత అంత parents ... ముఖ్యంగా తన parents కి నచ్చకుండా ఏ అని అయిన చేయడం నాకు అసలు ఇష్టం ఉండదు .. నా parents ని ignore చేయడం అసలే ఇష్టం ఉండదు .... so everything should be by their concern n with in their hands only and it should be with in the bounds of tradition.


ఇక నాలో సగభాగం అదేనండి partner గురించి అంటే .... మనకి ఆలోచనలు బాగానే ఉన్నాయి కాని dreams లేవుఅమ్మాయి fair గా ఉండాలి sure గా అమ్మ నాన్నలకి నచ్చాలి ..ఎలా ఉన్నా reddy కాకపోతే వద్దు ... అలా ఎవరినైనాచూసి తను లేకుండా నేను బతకలేనేమో అనిపిస్తే అపుడు వేరేవాళ్ళ గురించి ఆలోచిస్తాను అది అందరికి సమ్మతంగాఉంటె ఎవరికీ ఇబ్బంది కలగకుండా ఉంటేనే .... ఎందుకంటే నా వల్ల ఎవరు ఇబ్బంది పడకుడదు బాధపడకూడదు అనేదిచిన్నప్పటి నుండి నా mentality, నా తపన కూడా ... మనం parents కి ఎం ఒరగాబెదతమో తెలిదు కాని వాళ్ళనిప్రశాంతంగా ఉండనిస్తే చాలు అని నా భావన ... ఇంకా చెప్పాలంటే నా వల్ల ఒకమ్మాయిని parents miss అవ్వకూడదుఅది నాకు నచ్చదు అమ్మాయిలని వాళ్ళ అమ్మానాన్న ముఖ్యంగా fathers ఎంతగా ప్రేమిస్తారో కాస్త తెలుసు కాబట్టి ....
ఇక అమ్మ నాన్న మాటకి గౌరవం ఇస్తాను కాని నాక్కావలసింది అడగాల్సి వస్తే మాత్రం ఒప్పిస్తాను .. ఎలాగైనా సర్దిచెప్పి ఒప్పుకునేల చేస్తా ...
తనకి భూదేవికి ఉన్నంత కకపొఇన కాస్త ఓపిక ఎక్కువగానే ఉండాలి .. అర్థం చేస్కునే మనస్సు ఆలోచించగలిగి పరిస్థితులకి తగినట్లు ఉండగలిగే లౌక్యం ఉండాలి ... చాలా చాలా మంచిదై ఉండాలి .. పెద్దలకి ముఖ్యంగా అమ్మ నాన్నలకి గౌరవం ఇవ్వాలి .. వాళ్ళేమైనా అన్న కూడా broad గా అలోచించి అర్థం చేస్కోవాలి పెద్దవాళ్ళు కదా అలాగే ఉంటారు లే అని .. ఏదైనా వాళ్ళు చెప్పినపుడు వినాల్సి వస్తే వినాలి అది కరెక్ట్ కానప్పుడు మంచిగా అర్థమయ్యేలా ఎక్ష్ప్లైన్ చేయాలి .. ప్రేమగా ఇష్టంగా ఉన్నపుడు మనం ఏమి చెప్పిన ఎదుటి వాళ్ళు వింటారు positive గానే తీసుకుంటారు అని నా opinion
ఇంకా నా వైఫ్ అంటే అందరు బాగా ఇష్టపడతారు మా ఇంట్లో .. మా వదినల విషయం చెప్పలేము ఎందుకంటే నాకు ఆడవాళ్ళ మెంటాలిటీ సరిగ్గా తెలిదు igo problems ఉంటాయనుకుంటా హహహ ... ఈ లేడీస్ ఆలోచన విదానం మనకి అంతగా నచ్చదు ప్రతిదాన్ని Negative గా చూడటం ... మనం చదువుకున్న వాళ్ళము కదా లోకజ్ఞానం తెలిసిన వాళ్లము కనుక అన్ని కాకపోయినా కొన్ని Positive గా తీసుకోవాలి కదా

ఇక నా parents నాతోనే ఉండాలి నా లైఫ్ అంతా ..లేదంటే నా పర్యవేక్షణలోనే ఉండాలి ఏది ఎలా ఉన్నా వాళ్ళ బాద్యత నాదిగానే అనుకుంటా .. ఎంత సంపాదించినా ఎందరిని సంపాదించుకున్న తల్లి తండ్రి ని సంతోషంగా ఉండేలా చూడలేని పిల్లలు జీవితంలో అన్ని కోల్పోయినట్లే .... నా pocket లో money ఉండటం కన్నా అది అవసరాన్ని తిర్చేవిదంగా ఉండాలని కోరుకుంటాను .. బ్యాంకు balance maintain చేయడం కన్నా కష్టాల్లో ఉన్నవారిని ఆడుకోవడానికి అది ఉపయోగపడాలి అనుకుంటాను .. అలా అని plan లేకుండా తొందరపడి కష్టాలు తెచ్చుకోవటం కాదు .. మన కడుపు నిండాకేపక్కవాడి కడుపు నింపాలి అని నమ్ముత కాని ఒక్కొకసారి కచ్చితంగా మన సహాయం అవసరం అనుకున్నపుడు ఏది ఆలోచించకుండా అదుకునే గొప్ప మనసుండాలి.. మనసుల్ని మనుషులని గెలిచేవిధంగా జీవనప్రయానం రూపొందించుకునే strong mind ఉండాలి ..అన్ని విషయాలలో చేదోడు వాదోడుగా ఉండటమే కాదు అవసరమైతే lead చేయగలగాలి ...


main గా నాకు నా family అంటే ప్రాణం అలాగే తన ఫ్యామిలీ అన్న అలాగే ప్రాణంగా ఉంటాను .. నా parents ఇంకా ఇంట్లో ఎవరికీ problem వచ్చిన నేను చూసుకునేల Help చేసేవిధంగా ఉండాలి .. మానవత్వం must ..igo కి చాలా దూరంగా ఉండాలి ... చెప్పాను కదా ఎదుటివాళ్ళ మెదడు తో ఆలోచించటం నాకు అలవాటు కాబట్టి ఇన్ని చేబుతున్నవాడిని నేను ఎలా ఉండాలో తెలిసి ఉంటుంది కదా .. నా నుండి ఎం కోరుకుంటారో పూర్తిగా తెలియకపొఇన expectations తెలుస్తాయి కదా .. అలా ఉండటానికే ఇష్టపడతాను చెప్పటమే కాదు చేయటం కూడా బాద్యతగానే తిస్కుంటాను..

ఆమెకి కూడా parents అంటే పిచ్చి ప్రేమ ఉండాలి ..ప్రాణంలా చూసుకోవాలి అవసరమైతే దగ్గిరే ఉంచుకొని కేర్ తిస్కునేంత ఇష్టం ఉండాలి వాళ్ళకి problem వస్తే విలవిలాడిపోవాలి అది solve చేయడానికి ఎంత కష్టమైన తపించిపోవాలి .. హెల్త్ విషయంలో అయితే సేవ చేయాలి వాళ్ళకి ... ఎందుకంటే without them we wont కదా .. నా వరకి నా పేరెంట్స్ఎంతో తన పేరెంట్స్ అంతే నాకు ..నా ఫ్యామిలీ తన ఫ్యామిలీ ఒకటే అందరు ఇద్దరికీ equal priority నే అంటే ఎవరికీ prob వచ్చిన mutual గా ఇద్దరం కలసి సహాయంగా ఉండాలి , భేషజాలు igos ఉండకూడదు అవి నాకసలు నచ్చావు ... కోపతాపాలు క్షణికం కాని మానవత్వం final destiny .. అలగటం అన్న అలిగితే బుజ్జగించటం అన్న సరదా నాకు అల్లరి చేయటం చిన్నపిల్లలా చేస్తుంటే బాగా ఇష్టం నాకు అలా చేయటం అలవాటే అందులోనే మజా ఉంటుంది .... కాని ఏదైనా హద్దుల్లో ఉంటేనే ముద్దుగా ఉంటుంది, తెగేదాకా ఉండకూడదు serious అయ్యేదాకా తేచ్చుకోకూడదు .. ఇక నేను అనుకున్నట్లే 100% ఉండడం సాద్యం కాదు అది నాక్కూడా తెలుసు ..కొంచెం ఇలా ఉన్నా కూడా పాపం తనకి కొన్ని చోట్ల ఇబ్బందులు కష్టాలు తప్పవు for example ఎవరో reason లేకుండా ఎమన్నా అంటే పడాల్సి రావొచ్చు, అపుడు ఆ కోపం నా మీద తీర్చుకున్న పర్వాలేదు కానీ తను ఎక్కడ bad అవ్వకూడదు.. నా పెళ్ళాం అంటే నాకన్నా 100 times మంచిది అన్పించుకోవాలి అంతే ...
ఈ తిక్కలోడికి ఇంత మంచి పెళ్ళాం ఎక్కడ దొరికింది అనుకునేట్లు ఉండాలి ,హా ఇంకో మాట అందరు ఇలా అనుకునే వాళ్ళే కానీ చివరకి జరగవు compramise తప్పదు కానీ నాకు life విషయంలో compramise అంటే పరమ చిరాకు .. నేను అనుకున్నాను కాబట్టి ఉండాల్సిందే ఇక నా ప్రేమకి ఎలాంటి లోటు రాదు ....నేనిపుడేదో ఆవేశంలో exitement లో చెబుతున్నది కాదు ...ఇలా ఉండాలి అని 10 yrs కిందనుండే నాకో plan ఉంది. నేనెవరిని love చేయలేదు కాబట్టి నా pure love అంతా ఆమెకే..
no one has right in that .... ఇంకా నేను అనుకుంటాను నాది అందరి లాంటి life కాదు అని నేను కొంచెం తేడా కదా హహహ అదే different , అందుకే ఇపుడు ఒకమాట చెప్పి పెళ్ళయ్యాక అంతా తారుమరయ్యేలా ఉంటె అసలు ఒప్పుకోను ..i crossed lot of hard miles.. so ఇక పై happyness తప్ప sad ఉండకూడదు అందుకే ఎపుడు joke చేస్తూ jovial గా ఉండటానికి try చేస్తా అలాగని పిల్ల చేష్టలు అనుకుంటే పొరపాటు ...నాకు తెలిసి నా stage లో life గురించి ఇంత serious గా ఆలోచించిన వాళ్ళు ఎక్కువగా ఉండరనుకుంటాను. అందుకే ఎవరు వస్తారని
నాకేం బాధలేదు.. కానీ వచ్చే అమ్మాయి వల్ల నేను అదృష్టవంతుడిని కావాలి ..... ఇక మనలో మన మాట హహహ్హ love అనేది share చేస్కోవాలి అది లోపల దాచుకుంటే feel ఉండదు .
so తనకి అన్నం తినిపించటం హెల్త్ బాగాలేకపోతే దగ్గిరుండి చుస్కోవటం అవసరమైతే leave పెట్టడం ఇలాంటివన్నీ నా plan లో ఉన్నాయి హహః వద్దు అంటే నాకు పిచ్చి కోపం వస్తుంది మరీ ...
ఎందుకంటే జీవితం అంతా సంపాదించేసి ఎవడిని ఉద్దరించాలి ఇక్కడ మనల్ని నమ్ముకున్న ఒక్క అమాయక జీవిని కూడా సంతోష పెట్టకుండా కదా హహహ్హ ....

final point ఏమిటంటే " నా జీవితంలోకి ఒకమ్మాయి వస్తుందంటే తనని మొదటి రోజు (first day) ఎలా ఎంతగా ప్రేమిస్తూ ఉంటానో నా life లో చివరి రోజు (last day) వరకి కూడా అలాగే అంతగా ఇష్టపడాలి ప్రేమించాలి ..కాలానికి లోకానికి వయస్సుకి సంబంధం లేకుండా " అది concept

ఇంకా ముఖ్యమైన విషయం ఏమిటంటే మనం పెళ్ళికి cinema hero లాగా సాహసాలు చేయము తను నిజంగా నన్ను కోరుకుంటే నన్నే చేస్కోవాలి అనుకుంటే ఫుల్లుగా ఇష్టపడితే నేను తనకి కరెక్ట్ అని ఫీలయితే .. తనే వాళ్ళ parents ని ఒప్పించాలి ఎందుకంటే నాకు తెలిసి ప్రపంచంలో ఎక్కడో తప్ప parents ఎక్కడ విలన్స్ కాదు ,వాళ్ళ పిల్లలకి ఎం కావాలో వాళ్ళకి బాగా తెలుసు వాళ్ళు oppose చేస్తున్నారంటే sure గా బలమైన reason ఉంటుంది అది ఇంకా అమ్మాయిలని చాలా ఎక్కువగా ప్రేమించే fathers అయితే బాగా ఆలోచించాకే decide అవుతారు wat is wat అని నా నమ్మకం సో మనం కాస్త వాళ్లకి explain చేసి మెప్పించగాలగాలి , soo parents ఒప్పుకోకుండా ఒప్పించకుండా నాపెళ్ళి అసలు జరగదు... అది fix హహ్హహ .....

హా ఎం చెప్పుకోవాలి నా గురించి నేను ... చెప్పుకోడానికి ఏముంటుంది ... అని అంటానా !!!!
హహ్హహ అలా అంటే నేను నేనెందుకు అవుతాను ... మనం కొంచెం అందరిలా కాదు లెండి వెరైటీ కదా..... అందుకే కొట్టుకున్నంత డబ్బా ఉంటుంది ... చెప్పుకున్నంత సోది ఉంటుంది ... అంత చదవాలనుకున్న గాని ....
వినాలనుకున్నగాని మీకు కాస్త ఓపిక (ఎక్కువ ) ఉండాలి సుమ ...హహ్హహః చదువుకోండి ఇక ...............

ఈ నేను అందరిలో 'నేనే'
కొందరికి మెత్తగా కొందరికి కఠినంగా
తారసపడే నాలోని 'నేను'
ఈ కవితా రూపంలో
వ్యక్త పరచే ప్రయత్నం చేస్తున్నాను.

నేను నవ్వులు చిందిస్తాను
నిప్పులూ కురిపిస్తాను!
నేను హాయినిచ్చే శీతలపవనాన్ని
మాడ్చివేసే వడగాలి వీచికని!

ఇట్టే కరిగే వెన్నని చలనం లేని శిలని!
ప్రభాత కిరణాన్ని చిమ్మచీకటిని!

చల్లని వెన్నెలని
చంఢప్రచంఢ సూర్యకిరణాన్ని!
పిల్ల కాలువను మహాసంద్రాన్ని!

అందివచ్చిన అవకాశాన్ని
పొంచి ఉన్న ప్రమాదాన్ని!
సుతిమెత్తని తివాచీని
నడువజాలని ముళ్ళబాటని!

మధురమయిన సంగీతాన్ని
భయోత్పాత ప్రళయ ఘోషను!

నా గుండె లోతుల్లో
ప్రణయం కనిపిస్తుంది ప్రళయం గోచరిస్తుంది.

అర్ధమయ్యే ఓ సిద్ధాంతాన్ని!
అంతుబట్టని వేదాంతాన్ని!

పైన రాసిందంతా నేనే రాసానుఅనుకుంటే పొరపాటు సుమ ..మనకిరాయటం వచ్చు కానీ ఇది నేనురాయాలెదు ... మొత్తం నా గురించే కాబట్టి copy ,paste చేశా అంతే ....హహ్హహ్హహ.

Its time to act..................
నాకు తెలిసి మన life లో decission making కి ఉన్న importance తెలిసేది ఇప్పుడేనేమో
ఇప్పుడే ఒక కచ్చితమైన నిర్ణయాలు తిస్కోవాలి
i know wat am నేనేంటో నాకు బాగా తెలుసు , నాకేం కావాలో నాకు బాగా తెలుసు
నన్ను నేను guide చేస్కోగలను lead చేస్కోగలను అని నాకు నమ్మకం
చాలా మందికి ఎదుటివారు తమరు తమ గురించి చెప్పుకుంటే చులకనగా ఉండవచ్చు self డబ్బా అని fix అవ్వొచ్చు ,
కానీ అదే కరెక్ట్ కావొచ్చు కదా , ఎందుకంటే నా జీవితంలో నాతో అందరికన్నా ఎక్కువగా ఉండేది గడిపిదే నేను మాత్రమే, ఎవరైనా వాళ్ళ వాళ్ళ జీవితాలలో అందరికన్నా వాళ్ళతో వల్లే ఎక్కువగా గడుపుతారు కదా , మరి వాళ్ళ కన్నా ఎక్కువ ఇతరులకి ఎలా తెలుస్తుంది .. I spent every second with me myself than other... అందుకే నా మనసుకి ఎలా చేయాలనిపిస్తే అలా చేయడానికి రెడీ అవుతాను అలోచించి చించి
నేనేం కోరుకున్తున్ననో నాకు బాగా తెలుస్తుంది కాబట్టి నాకు నచ్చినట్లే నేనుంటాను .. నాలాగే నేనున్య అందులో మార్పులేదు

నేను పెళ్లి చేస్కోవాలి అన్న ఆలోచన నాకు వచ్చిన నాటి నుండి చాలా ఆలోచిస్తున్నాను , ఒకరకంగా చెప్పాలంటే నా ఉద్యోగం జీతం career గురించి కన్నా ఎక్కువగా ఆలోచిస్తున్నాను ఎందుకంటే career just part of life not complete life, but ఇది complete life
నేను 24 గంటలు job చేయను అలాగే job నచ్చకపోతే రోజుకొకటి అయిన మారొచ్చు అలాంటి అవకాశాలు కూడాఉంటాయి
కానీ జీవితం అలా కాదు 24 గంటలు 365 రోజులు feel అయ్యేది మనస్పూర్తిగా మనసుతో అనుభవించేది మళ్ళిమార్చుకోడానికి వీలు లేనిది
అందుకే నాకు తెలిసిన పిచ్చిలోనే నేను కొనసాగడానికి సిద్ధమయ్యాను
నిజానికి నేను చాలా ఎక్కువ ఆలోచిస్తున్నానేమో అనుకుంటాను , guilty గా ఉంటుంది కూడా
అందుకే వివరణలు
కొన్నిసార్లు కాదు చాలా సార్లు నాకు నేను కరెక్ట్ అనిపిస్తుంది , నేను ఇలా అలోచిన్చాడంలో తప్పు లేదనిపిస్తుంది
నేను కర్మ సిద్దాంతాన్ని బలంగా నమ్ముతాను జరిగేది జరుగుతుంది , కానీ నా ప్రయత్నాలు జరగాల్సిన దానిని బెటర్ గా జరిపించటానికి ఉపయోగపడొచ్చు ,నాదినాకు పిచ్చిల ఉన్న , నాకన్నా పిచ్చి వాళ్ళని చూసి realize అవుతున్నాను
చాలా మంది నాకన్నా పిచ్చిగా ఆలోచిస్తారు కానీ అంతా అయిపోయాక అన్ని కోల్పోయాం అనుకున్నాకా ఎపుడో, ఏ మందో తాగినపుడు emotion అయినపుడు , అలా ప్రతిసారి బయట పడతారు , కానీ నేను నాకు నేనుగా బయట పడతాను
అవసరం ఉన్న లేక పోయిన బయట పడతాను అదే తేడా .
I am strong thinker , బాగా ఆలోచిస్తాను selfconfident అందుకే నేను అనుకున్నది కరెక్ట్ అనిపిస్తే మొండిగాచేస్తాను
పైకి కనిపించిన దానికన్నా మొండి కొన్ని విషయాలలో మూర్ఖుడిని కూడా అదే మూర్ఖత్వం continue చేస్తున్నా.
చాలా sensitive emotional, నాలో ఎవరికీ తెలీని భావోద్వేగాలు , అసలు నాకే తెలీనివి ఎన్నో
ఇవన్ని నాకు నేను భరించుకోగాలను తప్పదు కాబట్టి కానీ ఇంకో కొత్త వ్యక్తి భరించాలని నేనెల అనగలను,శాసించగలను ?? .
సంపాదన పెద్ద విషయం కాదు నా వరకి సంపాదనే జీవితం కాదు , నాకు ఎలా సంపాదించాలో తెలుసు ఎలా హ్యాపీగాఉండాలో తెలుసు
సంపాదించాకపోయిన కొంచెమే సంపాదించినా హ్యాపీగా ఉండటం తెలుసు , కానీ హ్యాపీ ని అలాగే నిలబెట్టే వాళ్ళుకావాలి అర్థం చేస్కునే వాళ్లు కావలి .
కోట్లు ఉన్నవాళ్ళందరూ గొప్ప వాళ్ళు కాదు అసలేమి లేని వాళ్ళు పేదవాళ్ళు కాదు మనసు ఉన్నవాళ్ళంతా గొప్ప వల్లే , మంచి ఆలోచన ఉంటె చాలు , చేతనైతే నలుగురికి సహాయ పడాలి , సహాయం చేయకపోయినా పర్వాలేదు కానీ కీడుచేయకూడదు , మన అవసరం ఉన్నవాళ్ళకి మనం కచ్చితంగా సహాయపడాలి money కన్నా మానవత్వం గొప్పదనితెలిసి ఉండాలి నమ్మాలి .
నాకు ఎదుటివారికి సహాయపడటం ఒక పిచ్చి లాంటిది అలా నచ్చుతుంది కూడా , అలాగే చేయాలనిపిస్తుంది .కానీఇప్పటివరకి చాలా తక్కువ చేశాను , చేయడానికి నాకో తోడు కావాలి .
కొంత మంది నా గురించి ఏమి అనుకోరు maximum members in society ఎందుకంటే I am not a celebrity
కానీ కొందరు మాత్రం ఒక్కొకరు ఒక్కొక విధంగా అనుకుంటారు , కొందరు మంచి వాణ్ణి అంటారు కొందరు మరి అంతమంచోడెం కాదు అంటారు
కొందరు sensitive అని కొందరు emotional అని కొందరు బాగా పొగరని,బలుపని, దైర్యం బాగా అని పిరికి వాడిననిమంచి ఫ్రెండ్ ని అని ,కొందరు అసలు నాకు friendship తెలీదని ,మానత్వం లేదని హా ఇలా ఎవరికినచ్చిన విదంగావాళ్ళు అర్థం చేస్కుంటారు
నా ప్రమేయం లేకుండానే కొందరికి అభిప్రాయాలూ పుట్టొచ్చు అవి మారొచ్చు ,పూర్తిగా మారిపోవచ్చు కానీ ఫ్రాంక్ గా నిజాయితిగా నేనేంటో నాకే కరెక్ట్ గా తెలిదు .
నా అభిప్రాయం ఎపుడు మారలేదు still నా గురించి నాకేమి తెలిదు .
నాకు చాలా గొప్పగా బతకాలని ఉంటది అపుడే సింపుల్ గా ఉండాలనిపిస్తుంది సేవ చేయాలనీ ఉంటుంది దానికికుడాబద్దకంతో వాయిదా వేసే గుణం ఉన్నది , బాగా సంపాదించాలని సంపాదించటం లో పడిపోయి నేనేంటో మరచి పోకూడదని
ఇలా ఎన్నో shades అందుకే నాకు నేనే అర్థం అవను మిగతావాళ్ళకి ఎం తెలుస్తుంది ??
నెమ్మదిగా అందరికి అర్థమవుతు ఉంటుంది నేను ఎందుకు ఇది ఇలా రాస్తున్నాను అని
ఒక competetionlo marks పక్కవాళ్ళ నుండి తిసేసుకోమని అడిగితే
అందరు ఎక్కువ ఉన్న వాళ్ళ దగ్గిర తిస్కుంటారు కానీ ,నేనైతే తక్కువ ఉన్నవాళ్ళ దగ్గిరే తిస్కుంటాను ఎందుకంటే నాపిచ్చి నాదే, ఎక్కువ ఉన్నవాల్లవి లాక్కొని పోటి పడటం గెలవటం నాకు నచ్చదు ఎక్కువ ఉన్నవాళ్ళతో పోటి పడటంగెలవటమే ఇష్టం , గెలవకున్న ఓడకూడదు ..స్పూర్తి ని మర్చిపోకూడదు .. spirit ఉండాలి అంతే గెలవటం కన్నాచివరిదాకా గెలుపుకోసమే ప్రయత్నించటం ..ఓటమిని ఒప్పుకోక పోటి పడటమే నాకిష్టం ,ఎదుటి వాళ్ళని గెలిపించటంఇష్టం , వాళ్ళలాగా వాళ్ళ మనసుతో ఆలోచించటం ఇష్టం , నాకు ఓడిపోవటం కన్నా పోరాడటం ఇష్టం , గెలవటం కన్నాగెలిపించటం ఇష్టం ... నాకు నేనుల నేను నేనుగానే ఉండటం నాకిష్టం నా బలహీనత కూడా .
గెలుపుకోసం తపించేవారిని గెలిపించటం ఇష్టం ఓటమిలోనూ గెలుపును చుస్కోవటం గెలవటం గెలిపించటం ఇష్టం .


ఎవరికైనా తమ కంటే కింద వాళ్ళతో commanding గా ఉండటం careless గా మాట్లాడటం తమకన్నా superiors అంటే భయపడటం వాళ్ళతో బాగుండటం అలవాటు .. కాని మనం అలా కాదు మనకన్నా తక్కువ స్థాయి వాళ్ళని కూడా గౌరావించటమే గొప్పతనం.. వాళ్ళతో మర్యాదగా ఉండటం cool గా respond అవటం నాకలవాటు తక్కువ స్థాయి కదా అని cheap గా చూస్తే నాకైతే నచ్చదు
ఎదుటి ఎలా ఉన్నా నాలాగా నేను ఉండటం మర్చిపోను కాని ..మరీ తిక్కలోడు తగిలితే మాత్రం వాడేంతటి వాడైన మనకి dont care ..అహం లేని మనుషులంటేనే నాకిష్టం ... thats my Mind..
" my mind is ocean of thoughts " అది నాకు నేను ఇచ్చుకున్న బిరుదు హహహ్హ బావుంది కదా so ఆలోచనలకి అదుపు ఉండదు ..నాకు అలుపు ఉండదు ఆపే ఓపిక ఉండదు
ఇంత వెరైటీ గా different గా ఉండేవాడి గురించి ముందుగానే తెలుసుకుంటే బావుంటుందని నా ఉద్దేశ్యం లేదంటే మళ్ళి జీవితాలు బలవుతాయి హహహః ..... తెలుసుకోవడం చాలా అవసరం కుడా మనం బయటినుండి చూస్తే ఒకలాగా మాములుగానే కనిపిస్తాము ... కాని దగ్గరి నుండి భరించాలంటే కొంచెం ఓపిక ఉండాలి .. నా పక్కనే ఉంటూ నా జీవితంలో ఉండి నాతో ప్రయాణించడం అంత తేలిక కాదు
అందుకోసం ముందుగానే కాస్త mental preparation ఉండి తీరాల్సిందే ...

అందరితో బావుండాలి ... ఎవరినైనా నమ్మగలగాలి, ప్రేమించగలగాలి , ఇష్టపడగలగాలి ..అందరితో స్నేహంగా ఉండాలి మనుషులని ద్వేషించకుండా ఉండాలి money కన్నా మనుషులకి ఎక్కువ విలువనివ్వాలి దేనినైన చిరునవ్వుతో స్వీకరించాలి ..ఎప్పుడు నవ్వుతు నవ్విస్తూనే బతకాలి ... ఇతరులను బతికించాలి అవసరమైతే కష్టాల్లో ఆదుకోవాలనే మంచి మనసు ఉండాలి కలసి బతకాలి అనే తపన ఉండాలి సహాయం చేయడం లో ముందుండాలి సాదించడం లో వేగంగా ఉండాలి ...ముఖ్యంగా అతి గొప్ప లక్షణం క్షమా గుణం ఉండాలి ... ఇలా సాగుతుంటాయి నా ఆలోచనలు ..నా మనస్తత్వం ఇలాగె ఉంటుంది .. అందుకే నాకు గొడవలంటే పడవు ఆశయం అనేది ఉండదు ..అందువల్ల sensitiveness కూడా ఎక్కువే కొన్నిసార్లు ఇబ్బంది పడ్డా నాకు బాగానే ఉంది ఇలా .. ఇంకా చాలా ఉంది ఇక్కడే అంతా చెప్పేస్తే నాకేం కాదు కానీ చదవటం మీ వల్ల కాదు హహహ్హ .......


భాషకి భావానికి ముడిపెట్టి చూడటం నాకు నచ్చదు నా వల్ల కాదు కాని .. ఇక్కడ ఈ సోది అంతా ఎందుకు అనేది అర్థమవ్వాలంటే మాత్రం నా భాష మీకు తెలిసి ఉండాలి ..మనసు భాష అర్థం అవ్వాలి ,,, లేదంటే నా రాతలు మాటలు ఎం అర్థం కావు బూడిదలో పన్నిరులగా ఉండిపోతాయి నేను అర్థం కాని వాడిలాగే మిగిలిపోతాను .. మనం మనంగా ఉండాలంటే మనసులు గెలిచే వాళ్ళయి ఉండాలి ..ఎదుటి వల్ల pain ని feel అవ్వగలగాలి.. అందరిని ప్రేమించగలగాలి( నన్ను అందరి కన్నా ఎక్కువగా..చాలా చాలా ) ఉండాలి
ఏదైనా చేయగలిగే Confidence , challenging mentality, dynamic nature ఉండాలి kiddish గా ఉండాలి .. చిన్న పిల్లల మనస్తత్వం ఉన్నవాల్లంటే చాలా ఇష్టం ముఖ్యంగా అమ్మాయిలలో అలా ఉంటె చాలా sensitive ఇంకా చాలా మంచి వల్లయి ఉంటారని ఒక అభిప్రాయం హహహ్హ ... అవసరమైనపుడు చిన్న పిల్లలా అల్లరి చేస్తూ గోరుముద్దలు తినే వాళ్ళు , అవకాశం వస్తే ఎంతటి పెద్ద సమస్యనైన ఒక్క ఆలోచనతో పరిష్కరించే వాళ్ళు (A thundered prob solves with simple Idea) నన్ను guide చేసే విధంగా ఉండాలి ... నాకన్నా కొంచెం ఎక్కువే brain ఉండాలి నకనన్ పైన ఉండాలి ఎప్పుడు హహహ్హ ...
నాలాగే ఆలోచించాల్సిన పనిలేదు ..కాని నేనేంటో లైఫ్ అంతా తెలుసుకోగలిగితే చాలు .. లైఫ్ అంటే ఏంటో తెలిస్తే చాలు ..నేను చేసే ప్రతి పనిని సమర్థించాల్సిన అవసరం కూడా లేదు కాని నన్ను పూర్తిగా నమ్మితే చాలు ..పొరపాటు జరుగుతున్నపుడు సరిదిద్ది.. బాగా చేస్తున్నపుడు encourage చేయడం కావాలి .. నేను మొండిగా ఏదైనా చేస్తున్నాను అంటే అది చేయగలను అన్న confidence నాకు ఉంది అని నమ్మగలిగితే చాలు .. ఒకటికి పది సార్లు ఆలోచించకుండా ఏ పని చేయను నేను తొందర పడి.. ఇతరులకి ఇబ్బంది కలిగే పనులు అసలు చేయను .. నావల్ల ఎవరు ఇబ్బంది పడకూడదు అని నేను అనుకున్నట్లే తను అనుకుంటే చాలు ... నన్ను నన్నుగా నాకన్నా ఎక్కువగా ప్రేమించగలిగితే అంతా కన్నా ఎక్కువ ఏముంటది ఇంకా .................






1."ఒక కరెక్టు వ్యక్తిని కలుసుకోబోయే ముందు, పది మంది అనామకుల్ని విధి పరిచయం చేస్తుంది. మొదటి వ్యక్తి దగ్గరేఆగిపోయేవాడు అనామకుడు గానే మిగిలిపోతాడు"...
2.'అంతా తనదే' అన్నది మమకారము.'అంతాతనే' అన్నది అహంకారము...
3."నేడు రేపటికి 'నిన్న' అవుతుంది.నిన్నటి గురించి రేపు బాధ పడకుండా వుండాలంటే,నేడు కూడా బావుండాలి"...
4."మలుపు తిరగటానికి కరెక్ట్ ప్లేస్..Dead End....'అంతే అయిపోయింది ఇంకేమీ లేదు' అనుకున్నచోట ఆగిపోకు. ప్రక్కకి తిరుగు. మరోదారి కనపడుతుంది"...
5."నిన్నెవడయినా తప్పు పట్టాడంటే,నువ్వు తప్పు చేస్తునావని కాదు.నువ్వు చేస్తున్నపని వాడికి నచ్చలేదన్నమాట"...
6."ఓడిపోయే వాడు
ఒక్కసారే ఓడిపోతాడు. గేలిచేవాడు తొంబైతొమ్మిదిసార్లు ఓడిపోతాడు.వందసార్లు ప్రయత్నిస్తాడుకాబట్టి"...
7."నిన్నటినుంచి పాఠం గ్రహించి,రేపటి గురించి కలలుకంటూ రోజుని ఆనందించు.కేవలం బ్రతికేస్తూ జీవితాన్ని వ్యర్దంచేసుకోకు.ఇవ్వటంలో నీకు అనందం వుంటే ఇస్తూ అనందించు.అలా కాని పక్షంలో నీ అనందానికి అడ్డువచ్చేవారినందరిని నీ దినచర్య నుండి తోలగించు.రాజీపడి మాత్రం బ్రతకకు ".
,,,,,,,,,,,,,,,,.....................................................................,,,,,,,,,,,,,,,,,,