జీవితం పై ... నా భవిష్యత్తు పై ...కెరీర్ పై ఉద్యోగం సంపాదనా .. అన్నిటిపై నాకంటూ కొన్ని అభిప్రాయాలూ ఉన్నాయి ... పెళ్లి పై ఒక కచ్చితమయిన అభిప్రాయం ఉంది నాకు. నాకు ఎం కావాలి నేను ఎం చేయాలి అనే వాటి పై నాకు నిశ్చిత అభ్ప్రయలున్నాయి అవి చెప్పడానికే ఈ బ్లాగ్.
నేను ఒక పని చేసే ముందు చాలా ఎక్కువగా అలోచిస్త ఒకటికి వంద సార్లు ... ఈ పని చేయాల్సిన అవసరం ఉన్నదా ...ఉంటె పరిణామాలు ఫలితాలు ఏంటి ఇలా... అలాంటిది ఇలాంటి బ్లాగ్ ఒకటి రాసేముందు orkut , Mail create చేసేముందు ఆలోచించకుండా ఉంటానా??
చాలా ఆలోచించాను .. మనకి ఇంత అవసరమా ఇంత scene create చేయాలా అని ... నాకు నేను ఎప్పుడు కూడా కరెక్ట్ అనే అనిపించింది ... ఇక నేను రెడీ అయ్యాను నేను చేసేది పూర్తిగా నేను ఇష్టపడ్డాను కాబట్టే......
ఇక నేను ఎందుకు ఇష్టపడ్డాను ????.........................
ఒకమ్మాయిని అమ్మ నాన్న బందువులు అందరు కలిసి చక్కగా రెడీ చేసి నగలు గట్రా అన్ని పెట్టి .. డాంబికం కనబడేలాగా అని సిద్దం చేసి .. ఎవడో ఒకడి ముందు అప్పటికి ముక్కు మొహం తెలీని వాడు ముందు కూర్చో బెడితే వాడు official గా site కొడుతూ అందాన్ని మాత్రమే చూసి ... తీర కారణం లేకుండా నచ్చలేదు అనో తెగ నచ్చేసింది అనో అనేస్తే తంతు ముగిసినట్లే
ఇలా అంటున్నాను అని నాకు నమ్మకం లేదు అనుకోవద్దు మన ఆచారాలంటే నాకు చాలా గౌరవం కానీ .. పాతకాలం లో ఆ ఒక్క గంటలో మన చరిత్ర చెప్పేవాళ్ళు .. వాళ్ళ అంచనా పరిజ్ఞానం అలాంటిది .. ఇపుడు మనకేం తెలుసు అమ్మాయి ముక్కు ఏ హీరోయిన్ లాగా ఉంది పేస్ ఎలా ఉంది అని చూడటం తప్పితే ... ఇలా కుదిరిన వాటిలో ఎన్ని pellillu perfect ఉంటాయి ..ఎందరు కరెక్ట్ గా అర్థం చేస్కోగలుగుతున్నారు.. కలిసి ఉండగలుగుతున్నారు మొదటి చూపులో ఉన్న అభిప్రాయంతోనే ఉండగలుగుతున్నారు ఇవన్ని నా స్వంత ప్రశ్నలు ...!!!
ఇలాంటి సమస్యలు లేకుండా ఉండడానికే చూపులలో మాటలు కలిపారు .. ఇదొక నూతన ఒరవడి కానీ పది నిమిషాలలో ఎం మాట్లాడతారు .. అలాగని రోజులు రోజులు మాట్లాడుకుంటాం అంటే ఊరుకోరు కదా హహహ .. అందుకే అన్ని పెళ్ళిళ్ళు సగం సమాచారంతోనే అవుతున్నాయి ఫలితాలు ఇక అందరికి తెలిసినవే ........
అలా నా విషయం లో జరగటం నాకు ఇష్టం లేదు ... అందుకే నాకు కావాల్సింది ఏమిటో నేను తిస్కోని ఎదుటి వాళ్ళకి కావాల్సిన సమాచారం పొందుపర్చటమే నా బ్లాగ్ ముఖ్య ఉద్దేశం.
ఇక్కడ నా గురించి ఎం తెలుసుకోవాలనుకున్నా .. am free to express ... అలాగే జీవితానికి సరిపడా understanding kosam ఎన్ని రోజులైనా మాట్లాడుకోవచ్చు పూర్తిగా తెలుసుకుంటేనే దేనికైనా పరిపూర్ణత .. కానీ కొంచెం మాట్లాడిన ఒక వ్యక్తిని అంచనా వేయోచు కానీ ఆ కొంచెం మనకు కావాల్సిన అంశం అవ్వాలి ... అర్థమయ్యే మాటలవ్వాలి .. అందుకే ఈ ప్రయత్నం ...
ఇవి పెళ్లి చూపుల లాంటివే అనుకోండి .. అక్కడి లగే మాట్లాడటం అనుకోండి .. ఇంకా ఎలాగైనా ఫీలవ్వండి కానీ మనస్పూర్తిగా నమ్మండి అంతే...
నా అనుభవాల సాక్షిగా నాకు నా లైఫ్ అందరిలాగా ఉండటం ఇష్టం లేదు కాబట్టే ఇలాంటి ప్రయత్నం ఒకటి చేస్తున్నాను .. పైగా నేను కాస్త different కాబట్టి ...
ఇష్టం లేని వాళ్ళు చూడకండి మాట్లాడకండి ... కానీ దయచేసి వెక్కిరించకండి అన్ని ఆలోచించాకే నేని అడుగు వేసాను ...
హా ఇక కొంత మంది అనుమానాలు నివారించాల్సిన అవసరం కూడా నా పై ఉంది ... ఇదంతా smart acting కాదా ??? అందరు పెళ్ళిళ్ళు చేస్కోవటం లేదా దానికి ఇంత ఓవర్ అవసరమా అని ఇంకా చాలా అనుమానాలు .... ఒక్క విషయం గమనించాలి అలాంటి వాళ్ళు ... నిజంగా act చేయాలంటే నాకు ఇలా ఒక బ్లాగ్ రాయాల్సిన పనిలేదు ఇంత కస్టపడి ... మా అమ్మ నాన్న కూడా ఎంత కాదన్నా ఒక మంచి సంబందమే తెస్తారు అక్కడ కి వెళ్లి ఒక గంట నటిస్తే చాలు ... అపర శ్రీరాముడు లాగా కానీ నాకు అలా నచ్చదు ... ఎందుకంటే ఇది నా జీవితం మద్యలో ఏమైనా బడ పాడేది అనుభవించేది నేను కూడా ... అయిన నలుగు రోజుల సరదాకి చేసేవాడు act చేయవచ్చు కానీ నేను ఇక్కడ ఉన్నవాళ్లు అందరితో స్నేహం కోసం చేయటంలేదు కదా అందరిని నమ్మించటానికి ... కేవలం ఒక్కరి కోసం ఇదంతా ఆ ఒక్కరు జీవితం అంత నాతో ఉంటారు సో అపుడు తెలుస్తుంది కదా నటిస్తే హా ... కనుక ఇక్కడ నా మాటలు నిక్కచ్చిగా సూటిగా ఉంటాయి అందులో అనుమానం లేదు ఎవరైనా అపార్థం చేస్కుంటే అది నా తప్పు కాదు .
ఇక నా orkut profile చుసిన వాళ్ళందరికీ ఒక అనుమానం ... ఇది కేవలం reddy girls కి మాత్రమే ఎందుకు i purely here for reddy girls అని ఎందుకు రాసాను అని ... హా నేను reddy అయినపుడు వేరే రాయలేను కదా ఇక్కడ కేవలం ఒకే ఒక్కరి కోసం కొందరితో మాట్లాడటం అని చెప్పను కదా .. నా పెళ్లి కోసం ఈ ప్రయత్నం అయినపుడు ... దానికి తగినట్లే చెప్పాలి కదా ... నా పెళ్లి అమ్మ నాన్న లకి సమస్య కాకూడదు అని .. వాళ్ళ ని మనం సంతోష పెట్టక పోయిన ఫర్వాలేదు కానీ జీవితం అంతా నా వల్ల బాధ పడకూడదని ప్రయత్నం .. అందుకే అందని జాబిలీ కోసం పరుగెత్తకుండా అందుబాటులో ఉన్న వజ్రాలని అందుకోవాలని ... రెడ్డి లలోను నాకు కావాల్సిన వాళ్ళు ఉంటారని ..ప్రత్యేకంగా ఒక్కరిని వెతికి పట్టుకోవాలంటే అలా చెప్పడం తప్పదని అలా పెట్టాను అంతే ......
ఇక ఇలాంటి ప్రయత్నం ఎందుకు బ్లాగ్లు చాటింగ్ లు అంటే ... నాకు కంప్యూటర్ అరిచయం అయ్యాక చాలా తెలుసుకున్న మనషులు ఎదురెదురుగా మాట్లాడుకున్న అంతరంగం బయటకి రాదు నిజాయితిగా మాట్లాడుకోరు కాని ఇక్కడ ... మనుషులు మనుషులుగా మాట్లాడుకోవటం చూసాను .. వాళ్ళు ఏమనుకుంటున్నారో నిజాయితిగా చెప్పడం చూసాను ... మనసులో మాటని మొహమాటం లేకుండా నిర్భయంగా చెప్పుకోడం చూసాను ... ముఖ్యంగా అమ్మాయిల అబ్బాయిల సంభాషణకి సాదారణంగా ఉండే మంచి అనే రంగు లేకుండా నిక్కచ్చిగా సూటిగా ఉండటం చూసాను .. అందుకే ఈ మార్గాన్ని ఎంచుకున్నాను .
దీనిని మీరు అభినందించక పోయిన .. అనవసరపు గోల అనుకోరని భావిస్తూ .........................
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment