ఈ ప్రపంచం లో ప్రేమలు చాలా వరకు గుడ్డిగా పుట్టి గుడ్డిగా పెరిగేవే ..కాని గుడ్డిగా నిలబడేవి.. అంతే గుడ్డిగా కొనసాగేవి మాత్రం కాదు ..ఏదో ఒక త్రుష్ణలో మొదలై కొన్నాళ్ళు అంతా మనదే అంతా మనమే అన్నట్లు కొనసాగి.. రంగుల లోకం లో విహరిస్తూ సాగి పోయే ఓ అందమైన అనుభూతి.. కొదరికి ఇది కొన్నాళ్ళ ముచ్చటే.. అవంతారాలతో అన్ని మర్చిపోయే వాళ్ళు కొందరైతే .. రంగుల లోకాన్ని జయిన్చేస్తామని సాహసాలు చేసి నిలిచేవాళ్ళు కొందరు .... కాని అందత్వంలో నుండి వెలుగులోకి వచ్చాక కొన్నాళ్ళు బాగానే ఉన్నా.. ఉహించుకున్నన్ని రంగులు ఇక్కడ లేవని ఫరిదులు తప్ప పదనిసలు లేవని బ్రతుకు పోరాటాలు ఆరాటాలు తప్ప బ్రహ్మాండాలు లేవని బ్రహ్మలు వీడే నాటికీ ..ప్రేమలు తెలివు అనుభూతులుండవు .వాస్తవం అర్థమయ్యాక రంగులు మారి లోకం చీకటైన ఆశ్చర్యం లేదు .
అలాంటివాటి కంటే అబద్దం లో నుండి పుట్టే ఓ అందమైన అనుభూతే మేలనుకునే తత్వం నాది.. ఓ అందమైన వనం లోకి వెళ్తూ ఆనందాన్ని కలిగించే ఎన్నో దృశ్యాలని expect చేస్తాం తీర లోపలకు వెళ్ళాక ముళ్ళ పొదలుంటే మనల్ని మనమే తిట్టుకుంటాం అక్కడికి వెళ్ళినందుకు ... అదే ఒక గుహలోకి వెళ్తూ భయంగానే అడుగులేస్తము ఏమున్నాయో ఏముంటాయో తెలీకుండా ..తీర వెళ్ళాక భంకరమైన దృశ్యాలు ఉంటె మానసికంగా సిద్దమై ఉన్నాము కాబట్టి మనకి పెద్దగ భయం ఉండదు ..కానీ అందమైన అనుభూతులు ఎదురైతే అదొక గొప్ప వరంగా భావిస్తాం .... అలాంటి జీవితం కోసమే ఈ తపన .
ఎడారిలో వెళ్తున్నపుడు అసలేమీ దొరకక అల్లాడిపోతున్న సమయంలో ఒయాసిస్సు కనిపిస్తే జీవితలో ఎప్పుడు లేనంత సంతోషం దానిని ఒక గొప్ప వరంగా భావిస్తాము అలా అని అక్కడే ఇల్లు కట్టేస్కోని ఉండి పోతామా లేదు కదా .. అదే ఒక నది ఒడ్డున అయితే ఇల్లే కాదు జీవితం అంతా అక్కడే ఉండిపోమ్మన్న ఉండిపోతం ఎందుకంటే అది మనం వద్దనుకున్న మనక్కావల్సినవి ఇస్తుంది కాబట్టి... ఆకర్షణతో పుట్టే ప్రేమ అలాంటిదే ఒయాసిస్సుల ఆనందాన్ని ఇచిందని అక్కడే ఆగిపోలెం .. ఇంకా మనల్ని మనకన్నా ఎక్కువ ప్రేమించే వాళ్ళు ఉన్నారని మరచిపోలేం .. అమ్మ నాన్న జీవితమంతా కంటికి రేప్పెల కపుడుకునే ప్రేమ రూపాలు వాటిని మనం తక్కువ చేయలేము తుంచి వేయలేము ఆ ప్రేమ తరువాతే అన్ని ప్రేమలు ...

అలా అని నాకేదో ప్రేమ పై మంచి అభిప్రాయం లేదని అనుకోవద్దు ..అందరు నవ్వినా నేను ఎప్పుడే చెప్పేది ఒక్కటే ప్రేమ అనేది పార్కుల్లో కనిపించేది కాదు..." తల్లిలో, తండ్రిలో , గురువులో , స్నేహితుల్లో " ఇలా ప్రతి చోట మనం మనస్పూర్తిగా feel అయ్యేది ప్రేమే కదా . I like divine LOVE మనల్ని మనంగా ఆస్తులు అంతస్తులకు సంబంధం లేకుండా ..బాదలోను, భయంలోను గెలుపులోను ,ఓటమిలోనూ నేను ఉన్నాను అనే భారోసనే ప్రేమ అది ఎవరిదీ అయిన ఒక్కటే అనేది నా అభిప్రాయం. ప్రతి మనిషిలోను ప్రేమ ఉంటుంది అది పరిస్థితులను బట్టి బయటకొస్తుంది .. right time లో వస్తేనే దానికి విలువ ... ప్రతి అడ్డమైన ఆకర్షణకి ఆనందానికి ప్రేమ అనే పేరు పెట్టడం ????.........????
గమ్యంలో ఒక డైలాగ్ చాలా ఇష్టం .." ప్రేమని ప్రేమించిన ప్రేమ ప్రేమకై ప్రేమించిన ప్రేమని ప్రేమిస్తుంది ".

అందుకే నన్ను నన్నుగా ప్రేమిస్తూ నా చుట్టూ ఉన్నవాళ్ళని ప్రేమిస్తూ ..ప్రేమకి సరైన అర్థం చెప్పే వాళ్ళ కోసమే నా ఈ ప్రయాణం .... చేడులోను మంచిని చూడాలి .. ఆకలి అర్థాన్ని, సేవ విలువని తెలిసి ఉండాలి పక్కవాళ్ళ సంతోషం కన్నా వాళ్ళ బాదని ఎక్కువగా ప్రేమించాలి .. దేశాన్ని ఉద్ధరించక పోయిన పర్వాలేదు చేతనైన సహాయం చేయడంలో ముందుండాలి, చేసేవాళ్ళని అడ్డుకోవద్దు ఆసరాగా ఉండాలి అనే విచక్షణ ఉండాలి .... సహాయ పడటాన్ని సేవ చేయటాన్ని నాకన్నా ఎక్కువ ప్రేమించాలి ... హహహ చివరగా వీడి పెళ్ళాం వీడికన్నా different అనుకోవాలి అంతా ...హహహ్హ .. నేనెపుడు చెప్పే ఒక మాట తరచి చూస్తే ప్రతి మనిషిలోను మంచివాడున్నాడు ఎవరైనా జీవితం అనే వేదిక పై తమ పరిదిలోపే నటిస్తారు .........
హృదయం అందరికీ ఉంటుంది ప్రతి హృదయం స్పందిస్తుంది
కాని, ఇతరుల అవసరానికి స్పందించే హృదయం కొందరికే ఉంటుంది
అలాంటి కొన్ని హృదయాల తపన లో నుండే ప్రేమ పుడుతుంది
స్పందించే ప్రతి హృదయo లో ప్రేమ ఉంటుంది .. అలా స్పందించే ప్రేమే ఉన్నతం ...



ప్రేమ మనసులో వుంటుందా..? మనిషి లో వుంటుందా...? మాటల్లో వుంటుందా...?

నేస్తం..! ప్రేమ లేని చోటు అంటూ వుండదు..
తన కోసం వేచి చూసే కన్నులో ప్రేమ వుంటుంది.
పరుగులు తీసే పిల్లగాలికి చల్లనైన మల్లెల శుఘంధమంటే ప్రేమ. పగలంతా పడిన అలసటకికమ్ముకోచే చికటంటే ప్రేమ. నేర్రాలే నగలైన నెలకి ఒళ్ళంతా తడిమే జల్లంటే ప్రేమ.
ప్రతి చిగురికి పచరంగుని పూసే ప్రకృతికి పచ్చధనమంటే ప్రేమ. మన చుట్టూ ప్రేమ కనిపిస్తుంటే ప్రేమని అక్కడో , ఇక్కడో మాత్రం చెప్పలేము..
ప్రకృతిలోనే కాదు... మనలో, మన మనసులో, మన మాటల్లో ప్రేమ వుండాలి.

నిలోను , ని మనసులోనూ, ని మాటల్లోనూ... అన్నింట్లోనూ కలగలిసి వుంటేనే అది నిజమైన , పరిపూర్ణ మైన ప్రేమ..

0 comments:

Post a Comment