" Wherever there is a human being, there is an opportunity for kindness".
మనకి ఏ సంబంధం లేని వాళ్ళ కోసం మనం ఆరాట పడటంలో, సహాయపడటం లో మన మనసు ఎలాంటిదో తెలుస్తుంది ... ఎంత సున్నిత తత్వమో అర్థమవుతుంది ... సహాయం చేయకపోయినా పర్వాలేదు చేయాలన్న ఆలోచన వచ్చిన చాలు ..గొప్ప విషయమే ,ఎదుటి వాళ్ళ బాధని చూసి స్పందిస్తే చాలు అది ఓ మనిషి గుణమే... దీనినే మానవత్వం అంటే ... ఆ మానవత్వం అందరికి ఉండాలనేది నా అభిమతం ...... మనకోసం మనం కాకుండా ఇతరుల కోసం జీవించడంలో ఒక చెప్పలేని అనుభూతి ఉంది

If you want happiness for an hour, take a nap.

If you want happiness for a day, go and play Cricket.

If you want happiness for a year, inherit a fortune.

But if you want happiness for a lifetime, help somebody.


గొప్పవాళ్ళు కావడానికి సేవచేయల్సిన అవసరం లేదు .. పేరు కోసం సహాయపడటం నాకు నచ్చదు
మన వల్ల ఒకరు మనస్పూర్తిగా సంతోశిస్తున్నారంటే చాలు .. ఆనందంతో వాళ్ళు కార్చే ఓ కన్నీటి బొట్టు చాలు ఆ ఆప్యాయత ఏంటో తెలియడానికి.. మన వల్ల ఒకరు కష్ట పడకపోతే ,మనం ఒకరి కన్నిళ్ళకి కారణం కాకపోతే చాలు ... లోకాన్ని ఉద్దరించాలనేది నా అభిప్రాయం కానే కాదు .. ఉన్నదంతా ఊడ్చి పెడుతూ, అందినంత దండుకునేవాడికి సహాయపడమనేది నా విన్నపం కానే కాదు ... ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టలేక పోయిన గుక్కెడు గంజి పోసినా , వాడు సంతోషిస్తాడు అనేది నా సిద్ధాంతం ... నా జేబులో 101 రూపాయి ఉన్నపుడు నేను అందులో ఒక్క రూపాయిని సహాయం చేయడం లో .. దాతృత్వం లేదు, మానవత్వం అంతకన్నా లేదు .. మనిషిగా చిన్న స్పందన తప్ప ... అదే నేను చెప్పే సేవ, చేసే సేవ మాట్లాడే సహాయం ,,,
ఆకలితో ఉన్నవాడి కళ్ళలో ఆనందం చూడటం ... చదువు కొనలేక ఆత్మహహ్యలకు పాల్పడే వాడిని ధైర్యపరచటం ... అపర జ్ఞానాన్ని డబ్బులేదనే సాకుతో వృధా పోకుండా చూడటం .. చేయి చాచి అర్థించిన వాడిని ఆదుకోవాలనే మనసు ఉండటం, ఇవన్ని మనం చేసే త్యాగాలు కాదు .. మనుషులుగా మన కనీస బాధ్యతగా చేసేపనులు..
నా దగ్గిర 10 రూపాయలు ఉన్నపుడు, ఉన్నవన్ని నేను donate చేయలేను .. అంతా మంచివాడిని కూడా కాదు నేను, అది నాకు తెలుసు .. కానీ నా దగ్గిర 1000 రూపాయలు ఉన్నపుడు కూడా పది రూపాయలిచ్చి ఆదుకోలేకపోతే నా మనసు ఊరుకోదు....
నాకు ఇలాంటి పనులు చాలా ఇష్టం ... నిజానికి నేను ఇంతవరకు ఎక్కువగా చేయలేదు ఎప్పుడో చిన్న చిన్నగా తప్ప .. కాని ఇప్పుడు నేను చేయకపోయినా .. నన్ను చేసేలా ప్రోత్సిహించాలి , చేయుతనివ్వాలి .. ఎందుకంటే ఇన్నాళ్ళు కొన్ని కారణాల వల్ల నేను సీరియస్ గా చేయలేకపోయానేమో కాని చేయాలన్న తపన నాలో చాలా ఎక్కువే... ఇన్నాళ్ళు మొహమాటం అడ్డం వచ్చింది ..సంపదిన్చాకే చేయాలన్న అభిమానం అడ్డం వచ్చింది .. నేను సంపాదించుకున్నది నన్ను ఉద్దరించుకోవడానికే సరిపోతుంది అన్న ఆలోచన ఆపి ఉండవచ్చు .. చేసిన కొంత సహాయం అయిన నేను స్వయంగా సంపాదించినదే కానీ .. అమ్మ నాన్న కస్టపడి పెడితే అప్పనంగా దానం చేసే రకం కాదు నేను .... అలాగని ఆదర్శాలు వల్లించే రకం కూడా కాదు.. నాకు చేయాలి అనిపించింది నేను చేస్తున్నాను .. మిగతా వాళ్ళ సంగతి నాకు తెలిదు .. కానీ నాతో జీవితమంతా ఉండేవాళ్ళకి తప్పదు నా యోచనలో సగం నా పాపం లో సగం కాబట్టి హహహహ్హ

అసహయులని , అచేతనంగా ఉన్నవాళ్ళని చూస్తే ఏదో తెలీని ప్రేరణ మొదలవుతుంది లోలోపల .. డబ్బులు లేకుండా చదువుకోసం ఇబ్బంది అదే వాళ్ళని చూస్తే అపుడపుడు కళ్ళు చెమర్చుతాయి కూడా ... అందుకే నా లోపలి మనిషిని సంతోష పెట్టాలనే నా స్వార్థం తోనే కాని నేనేదో త్యాగాలు చేస్తున్నా సేవ లో తరించి పోతున్న అన్న భావన నాకేనాడు ఉండదు .... అందుకే ప్రచారం లేని ప్రయత్నం ఉండాలి ...
నన్ను అందరు సాధారణం గా పిసినారి అంటారు .. నిజమే కావొచ్చు కానీ నా దగ్గిర డబ్బులు కుప్పలుగా ఉండవు అలాగని ఊరకే కూర్చునే రకం కాదు.. సంపాదించటం, అవసరం అన్నవాడికి కష్టంలో ఉన్నాడు అనుకుంటే ఇచ్చి సంతోషించటం (మళ్ళి తిరిగి తిస్కుంటాను అనుకోండి కానీ .. అనవసరమైన కర్చులకన్నా అవసరానికి ఆదుకోవడమే గొప్ప అనుకుంటాను) నా అలవాటు .. ఫ్రెండ్స్ పార్టీ అడిగితే కూడా, ఆ డబ్బులు ఏ అంధ శరణాలయం లోనో , అనాధ శరణాలయం లోనో donate చేయవచ్చు కదా అని ఆలోచించే రకం నేను ... అనవసరంగా కర్చు పెట్టను అలాగని అవసరం లో అబద్దలడాను ... నా వల్ల కాని భారాన్ని నేను మోయను .. నా వల్ల అయ్యే సహాయాన్ని చేయకుండా ఉండను ..
హహహ్హ ఇదేం పిచ్చి అనుకోవచ్చు కాని చెప్పానుకదా నేను ఏది నమ్మిన అది మొండిగా చేస్తాను .. నేను పీకల్లోతు కష్టాలలో ఉండి ఒక్కరు సహకరించిన బావుండు అనుకున్నపుడు నాకు ఎవరి సహాయం లేదు .. ఫీజులు కట్టకుండా ఎవరి హెల్ప్ లేకుండా నేను పడ్డా కష్టాలు నాకు తెలుసు అందుకే ఎవరన్న అలా కష్టపడితే నాకు నచ్చదు ..అందుకే instant గా అయిన హెల్ప్ చేసి సంతోషిస్తాను .... మొత్తంగా మన mentality ఏంటంటే కడుపు నిండా తిన్నవాడికి పంచభక్ష పరమాన్నాలు పెట్టిన ఏదో ఒక లోపం చూపించి తిట్టి పొవచ్చు కాని .. ఆకలితో అలమటిస్తున్న వాడికి కారం మెతుకులు పెట్టిన మహాప్రసాదం ల చూస్తాడు, అది matter ..... నేను ఎవడికి కర్చు పెట్టనని నన్ను పిసినారి అన్న వల్ల కన్నా, నేను హెల్ప్ చేసినపుడు థాంక్స్ అనుకున్న వల్లే ఎక్కువ ... ఇక్కడ ఒక్కటి గమనించాలి, నేనేదో 1000 కర్చుపెట్టి పార్టీ ఇస్తే ఎవడికి గుర్తుండదు డబ్బులు ఒవడం తప్ప .. ఇలా అయితే మళ్ళి నా డబ్బులు నాకే ఇస్తారు, కానీ వాడికొక హ్యాపీ హహహః అది సంగతి మరీ అవసరానికి, సహాయానికి ఉన్నా పవర్ అలాంటిది ...
అందరు కలసి తిరేగేటపుడు , టీ లు తాగేటపుడు, పార్టీ చేస్కునేటపుడు తెగ friendship ఫీలవుతారు ... కానీ పీకల మీదికి వచ్చినపుడు ఎవడు పట్టించుకోడు, బాధల్లో పక్కన ఉండటమే నిజమైన స్నేహం .. అవసరం లో ఆసరాగా ఉండటమే స్నేహం అని నమ్ముతాను నేను .. అలాగని ఎవడికి పడితే వాడికి చేస్తాను అనుకోవద్దు దానికి అర్హత ఉండాలి ..

ఇక ఈ అన్నదానాలు అవి నాకు కొంచెం నవ్వు తెప్పిస్తాయి ............ ముఖ్యంగా దేవాలయాలలో అన్నదానాలు అంటారు .. బాగా ఇంట్లో పరమాన్నాలు తినగలిగిన వారే తింటారు అక్కడ, ఎమన్నా అంటే దేవుడి ప్రసాదం అంటారు ..మిగిలితేనే పాపం అక్కడ అడుక్కునే వాళ్ళకి భిక్షగాల్లకి పెడతారు .. ఇల్లాంటి వాటిని దేవుడు హర్షిస్థాడా... ఇంట్లో మూడు పూటల తినగలిగిన వాడికి ఎందుకు అన్నదానం .. లేని వాడికి తినలేని వాడికి ఒక్క పుట కూడా సరిగా తిండి దొరకనివాడికి పెట్టాలి కాని .. దేవుడి ప్రసాదం అంటే గుడిలో పూజ సమయంలోనే పెడతారు కదా సరిపోదా ...

social service విషయంలో నాకు కొన్ని ఆలోచనలు ఉన్నాయి.. ఇందుకోసం నేను orkut, mail, blog, లాంటివి ఉపయోగించుకుంటాను .. ఇంకా ఫ్రెండ్స్ తో కలిసి community రన్ చేయాలనేది నా ఆలోచన... ఎందుకంటే నా ఒక్కడితోనే అంతా కాదు కాబట్టి .. కావాల్సిన సహాయమంత అందించడానికి నేను కోటిశ్వరుడిని కాదు కాబట్టి .. అందరిని కలుపుకొని అందరిలో ఒక్కడిగా సహాయపదలనేది నా కోరిక.. దానికి పెద్ద process నే నా mind లో ఉంది .... ఇందుకోసం నాకు తన హెల్ప్ కావలి ఒక వేళ నేను busy ఉంటె తను చూసుకోవాలి .. తన పనులు నేను చూసి పెడతాను అనుకోండి .. మొత్తంగా తనకి interest ఉండాలి ఇలాంటి వాటిపై ..లేకున్నా కలిగించుకోవాలి నా కోసం ..... తనకి చాలా సున్నిత మనసు ఉండాలి, స్నేహభావం ఉండాలి అపుడు ఇది పెద్దగా కష్టం కాదు ..

ఇక ఇంట గెలిచి రచ్చ గెలవాలన్నది నా policy ..
అందుకే ముందు నా ఫ్యామిలీ తర్వాత others .... గతం లో నాకున్న కొన్ని అనుభవాల దృష్ట్యా, ఇంకా నాకున్న కొన్ని ఆలోచనల ప్రకారం నా salary 1yr నుండి 2yr వరకు మా అమ్మ నాన్నకి, పిల్లల పేరు మీద deposit చేయాలన్నది చాలాకాలంగా నా ఆలోచన ... వారి వారి ఆరిగ్యం మరియు చదువుల అవసరాల కొరకు, అదేంటి వాళ్ళ parents అది చూసుకుంటారు కదా అనుకోవచ్చు .. చెప్పాను కదా ఇవి deposit గానే ఉంటాయి , అలాంటి అవసరం ఏదైనా వస్తే ఇవ్వడానికి అంతే..నా చుట్టూ ఉన్నా ప్రపంచం మరో ప్రపంచంలోకి దుసుకుపోవాలి కానీ ఏ కారణం వాళ్ళ ఎక్కడ ఆగిపోకూడదు అనేది నా అభిమతం ... ఇంకా detail గా clear గా అర్థం కావాలంటే నాతో మాట్లాడి తెలుసుకోవాల్సిందే అన్ని ఇక్కడే చెప్పడం కష్టం కదండీ ...

ఇంకా ఈ శరణాలయాలు, వ్రుద్ధాశ్రామాలలో, అలాగే పేదలకు అన్నదానాలు , సహాయం చేయడాలు లాంటివి , పిల్లల్ని కలుసుకోవడం వాళ్ళ మద్య గడపడం లాంటివి కొంచెం ఇష్టం అనుకోండి కాని ఇప్పటివరకు చేయలేకపోయాను .. తర్వాత ఎలాగైనా చేయాలనీ ఆశ .. ఇక్కడ కూడా నాకు ఒక ఆలోచన ఉంది .. పెళ్ళిలలకు వచ్చేసరికి ,మనం మనంగా ఉండి ఒంటరిగా ఉన్నపుడు చచ్చామో బతికామో కూడా చూడని బంధువులందరి మెప్పు కోసమని లక్షలు కర్చు పెట్టి ఆడంబరాలు చేసి తీర వాళ్ళ తిట్లు, పెదవి విరుపులు భరించడం కన్నా , అక్కడేదో చేసామా అంటే చేసామా అన్నట్లు కానిచ్చేసి మనల్ని మనసారా దీవిస్తూ ఉండే చోట, కడుపు నిండా ఒక్క రోజు ఒక్క పూట అయిన తిండి పెట్టాలని ఒక పిచ్చి కోరిక .. ఇది ఎంతవరకు ఎందరు సమర్థిస్తారో తెలిదు కాని .. నా పెళ్ళిలో పెద్దల వరకి వాళ్ళ పద్దతిలో ఆడంబరాలు చేసుకున్న .. నాదంటూ సంపాదన నుండి( తనది నా mentalty నే అయితే తనది కలపి) కనీసం ఒక 50 మందికి అయిన నిజంగా ఆకలితో ఉన్నవారికి , విందు భోజనం కాకపోయినా మాములు భోజనం అయిన పెట్టాలని ఆశ .. అపుడే దేవుడు కూడా మనస్పూర్తిగా దీవిస్తాడని నా నమ్మకం .....

చివరగా ఒక మాట ఒక మనిషి సగటు జీవిత కాలం 60-65 సంవత్సరాలు అనుకుంటే .. ఇంకా మనకున్నది 35-40 అంతే .. ఇందులో అన్ని పోను కరెక్ట్ గా బతికేది ఒక 15 సంవత్సరాలు ఉండవచ్చు .. ఈ కాస్తలో మన కోసం కాకుండా ఎంత కాలం బతికాము అన్నదే అర్థవంతం ... గెలవటం కన్నా గెలిపించటం లో మజా ఉంది అది అనుభవించటం నేర్చుకోవాలి అంతే ...........

చివరగా ఒక్కమాటలో .. సేవ చేయడానికి ప్రోత్సహిస్తాను అలాగే నేను చేస్తాను .. నా salary లో 5-10% ఇందుకోసం కేటాయిస్తాను తను ఇంకా నాకన్నా మంచిదై ఇంకా ఎక్కువ donate చేద్దాం అంటే ..ఇంకా చాలా సంతోషం ...

ఈ విషయాలలో నేను చెబుతూ పోతే .. end అవడం కష్టం కాని ఇంకా చాలా చాలా ఉందీ.. ఎలాంటి అనుమానాలు అపోహలు లేకుండా .. మాట్లాడుకున్నపుడు వివరణాత్మకంగా చెప్పడానికి వీలుంటుంది .. basic గా నా ఆలోచన ఇలా ఉంటుందని చెప్పడం అంతే ....









0 comments:

Post a Comment